నాగబాబు కూతురు నిహారిక రూటే సపరేటు (ఫోటోస్)
హైదరాబాద్: ప్రముఖ నటుడు, నిర్మాత నాగబాబు కుమార్తె నిహారిక ఇపుడు టాలీవుడ్లో సరికొత్త సెల్రబిటీ. అంతా ఆమె హీరోయిన్ అవుతుందని అనుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా 'ఢీ'-7 యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది. తనదైన యాకరింగుతో, బబ్లీ యాటిట్యూడ్‌తో ఆకట్టుకుంటోంది. ప్రేక్షకులు, అభిమానులు నిహారిక సూపర్ అంటూ కితాబిస్తున్నారు.
ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ నుంచి హీరోలు మాత్రమే వచ్చారు. త్వరలో ఆ ఫ్యామిలీ నుంచి సినిమా హీరోయిన్ కూడా రాబోతుందనే సంకేతాలు నిహారిక జోరు చూస్తుంటే స్పష్టంగా కనిపిస్తోందని అంటన్నారు. అయితే ఈ విషయాన్ని మనం ఊహించడం కష్టమే. ఎవరూ హించని విధంగా సపరేటు రూటులో వెలుతోంది నిహారిక.
మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి మాదిరి నిహారిక బుల్లితెర నుండి మొదలు పెట్టి వెండి తెర వైపు అడుగులు వేసే దిశగా తన ప్రయాణం కొనసాగిస్తోందా? లేక మరేదైనానా? అనేది కాలమే నిర్ణయించాలి.
ఇతర సెలబ్రిటీల మాదిరిగానే నిహారిక కూడా సోషల్ నెట్కవర్కింగులో యాక్టివ్‌గా ఉంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా నిహారిక తన అందమైన ఫోటోలను విడుదల చేస్తూ అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అందుకు సంబంధించిన వివరాలు స్లైడ్ షోలో...

నాన్న పుట్టినరోజున ఇలా..
తండ్రి నాగ బాబు పుట్టినరోజున ఇలా తన సోషల్ నెట్వర్కింగులో ఓ సెల్ఫీ పోస్టు చేసింది నిహారిక. నున్నే నాకు కొండంత బలం నాన్నా అంటూ పేర్కొంది.

ఢీ జూనియర్స్
డీ జూనియర్స్ కార్యక్రమంలో ఏంజిల్ లుక్ లో దర్శన మిచ్చిన నిహారిక.

సెలబ్రిటీ
టాలీవుడ్ సర్కిల్లో ఇపుడు నిహారిక పెద్ద సెలబ్రిటీ అయిపోయింది. బుల్లితెర ద్వారా ఆమె ప్రతి తెలుగు ఇంటికి పరిచయం అయింది.

బబ్లీ లుక్
డీ జూనియర్స్ కార్యక్రమంలో ఇలా బబ్లీ లుక్ తో కూడిన సెల్పీ పోస్టు చేసింది నిహారిక.

ఫ్యూచర్ ప్లాన్స్
నిహారిక ఫ్యూచర్ ప్లాన్స్ ఏమిటి? బుల్లితెరకే పరిమితం అవుతుందా? లేక వెండితెరపైనా తన టాలెంట్ ప్రదర్శిస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











