మెగాడాటర్ సూపర్ లుక్: కోలీవుడ్ అరంగేట్రం చేస్తున్న నిహారిక
రెండో సినిమా కోసం ఆచితూచి అడుగులు వేసిన నిహారిక కోలీవుడ్‌కు వెళ్లింది. ఓ మంచి ఆఫర్ రావడంతో అటు వైపు వెళ్లింది. స్టార్ హీరో విజయ్ సరసన నటిస్తోంది.
Recommended Video

దాదాపుగా మెగా హీరోల వారసులు వచ్చినా హీరోలంతా ఒక ఎత్తయితే ఆ కాంపౌండ్ నుంచి వచ్చిన నీహారిక ఎంట్రీ ఒకెత్తు. హీరోయిన్ గాచేసినా గ్లామర్ పాత్రలు చేసే అవకాశం వెబ్ సిరీస్‌లు, చిన్న తెరలో కనిపిస్తూ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక సందడి చేస్తోంది. ఇటీవలనే తండ్రితో కలిసి ఓ వెబ్ సిరీస్ ప్రారంభించారు. దాని ప్రొమోకు విశేష స్పందన వస్తోంది.

రెండో సినిమా కోసం
తెలుగులో పెద్దతెర అరంగేట్రం అచ్చి రాలేదు. ఒక మనసు చిత్రం అందరికీ నచ్చినా పెద్దగా ఆడలేదు. దీంతో ఆ అమ్మడు తమిళ పరిశ్రమకు వెళ్లింది. రెండో సినిమా కోసం ఆచితూచి అడుగులు వేసిన నిహారిక కోలీవుడ్‌కు వెళ్లింది. ఓ మంచి ఆఫర్ రావడంతో అటు వైపు వెళ్లింది. స్టార్ హీరో విజయ్ సరసన నటిస్తోంది.

ఒరు నల్ల నాల్ పాతు సొల్రేన్
ఇప్పటికే చాలా భాగం ఆ చిత్రీకరణ పూర్తయ్యింది'ఒరు నల్ల నాల్ పాతు సొల్రేన్' అనే టైటిల్ పై రూపొందుతున్న ఈ చిత్రంలో.. స్టార్ హీరో విజయ్ సేతుపతితో పాటు.. కుర్ర హీరో గౌతమ్ కార్తీక్ కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో నీహారిక న్యూ లుక్ తెగ హల్ చల్ చేసేస్తోంది.

సాంప్రదాయ దుస్తుల్లో
ఈ ఆర్ముగ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై కోలీవుడ్ లో మంచి ఆసక్తి కనపడుతోంది. రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించి.. నీహారిక లుక్ బయటకు వచ్చింది. సాంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తున్న నీహారిక స్టిల్ ఒక్కసారిగా షాక్ కొట్టించేసింది. ఒంటి నిండా ఆభరణాలు.. ధరించిన దుస్తులు అన్నీ పూర్తి స్థాయి రీగల్ లుక్ లోనే ఉన్నాయి.

కోలీవుడ్ అరంగేట్రం
ఇప్పటివరకూ ఈ సినిమా కంటెంట్ గురించి లీక్ కాకపోయినా.. నీహారిక లుక్ ను చూస్తే మాత్రం.. ఈ చిత్ర కథపై ఊహాగానాలు మొదలైపోయాయి. మరోవైపు.. కోలీవుడ్ అరంగేట్రంలోనే నీహారిక పై అంచనాలను పెంచేందుకు ఈ సాంప్రదాయ లుక్ బాగా ఉపయోగపడుతోంది.


Click it and Unblock the Notifications











