సుకుమార్‌తో సినిమా చేయబోతున్న మెగా డాటర్ నిహారిక!
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన తొలి హీరోయిన్ నిహారిక కొణిదెల నటిగా తనను తాను నిరూపించుకుంటూ... సెలెక్టివ్‌గా కథలు ఎంచుకుంటూ తెలుగు సినిమా పరిశ్రమలో తనంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. తాజాగా నిహారికకు సంబంధించి ఓ ఆసక్తికర న్యూస్ వినిపిస్తోంది.
ప్రముఖ టాలీవుడ్ ఫిల్మ్ మేకర్ సుకుమార్‌తో కలిసి నిహారిక సినిమా చేయబోతున్నారు. అయితే దీనికి దర్శకత్వం వహించేది ఆయన కాదు. ఆయన కథ, స్క్రీన్ ప్లే, డైలాగులు అందించడంతో పాటు తన బేనర్ 'సుకుమార్ రైటింగ్స్'పై నిర్మించబోన్నారు.

దర్శకత్వం ఎవరంటే..
సుకుమార్ వద్ద డైరెక్షన్ డిపార్టుమెంటులో పని చేసే ఒక కుర్రాడిని ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆల్రెడీ నిహారిక కథ విని ఇంప్రెస్ అయిందని, ఈ ప్రాజెక్ట్ చేసేందుకు సైన్ చేసినట్లు తెలుస్తోంది.

సహ నిర్మాతలుగా అల్లు అరవింద్, నాగబాబు
అంతే కాదు.. ఈ ప్రాజెక్టులో అల్లు అరవింద్‌కు చెందిన గీతా ఆర్ట్స్, నాగబాబుకు చెందిన అంజనా ప్రొడక్షన్స్ కూడా భాగస్వామ్యం కాబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు అఫీషియల్‌గా ప్రకటించనున్నారు.

సూర్యకాంతం
ప్రస్తుతం నిహారిక ‘సూర్యకాంతం' అనే చిత్రంలో నటిస్తోంది. ప్రణీత్ బ్రమండపల్లి దర్శకత్వంలో 'సూర్యకాంతం' తెరకెక్కుతోంది. స్టంట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ విజయ్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు.

నిహారిక కొణిదెల
2016లో ఒక మనసు చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైన నిహారిక.. తర్వాత తమిళంలో ‘ఓరు నల్ల నాల్ పాతు సొల్రెన్' సినిమాతో పాటు తెలుగులో ‘హ్యాపీ వెడ్డింగ్' చిత్రంలో నటించింది. అయితే ఇప్పటి వరకు ఆమె నటించిన సినిమాలేవీ కమర్షియల్‌గా వర్కౌట్ కాలేదు. త్వరలో నాగబాబు నిహారికకు పెళ్లి చేయాలనే ఆలోచనలో ఉన్నారు.


Click it and Unblock the Notifications











