డుమ్మా కొట్టిన నాగబాబు కూతురు, ఫ్యూచర్ ప్లాన్స్ (ఫోటోలు)
హైదరాబాద్: ప్రముఖ నటుడు, నిర్మాత నాగబాబు కుమార్తె నిహారిక ఈటీవీలో ప్రసారం అవుతున్న 'ఢీ'-7 కార్యక్రమానికి యాంకర్‌గా మారి తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఆ సంగతి పక్కన పెడితే గత కొన్ని రోజులుగా నాగబాబు కూతురు హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతుందనే వార్తలు వినిపించాయి.
అయితే ఆమె ఫ్యూచర్ ప్లాన్స్ మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. భవిష్యత్తులో ఏం చేయాలనే అంశంపై నిహారిక స్పందించారు. తన ఫేవరెట్ హీరో, దర్శకుడు తదితర అంశాలను గురించి మాట్లాడారు. నిహారిక ఫేవరెట్ హీరో నాగార్జున. నాగార్జున సినిమాలు అసలు మిస్సవకుండా చూస్తుందట.
అదే విధంగా దర్శకులు రాజమౌళి, శేఖర్ కమ్ముల సినిమాలంటే కూడా చాలా ఇష్టమట. చాలా సార్లు కాలేజీకి డుమ్మా కొట్టి మరీ చూసేదట. నిహారిక ఫ్యూచర్ ప్లాన్స్‌కు సంబంధించిన వివరాలు స్లైడ్ షోలో...

టీవీ యాంకర్‌గా
ప్రస్తుతం టీవీ యాంకర్‌గా మారిన నిహారిక....కేవలం తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసమే ఈ రంగం వైపు వచ్చినట్లు తెలుస్తోంది.

భవిష్యత్తులో నిర్మాతగా
భవిష్యత్తులో నిర్మాతగా మారి సినిమాలు తీయాలనే ప్లాన్స్ ఉన్నాయని నిహారిక చెప్పుకొచ్చారు.

తండ్రి బ్యానర్లోనే..
ప్రస్తుతం తన తండ్రి స్థాపించిన అంజనా ప్రొడక్షన్స్ బేనర్లో టీవీ సీరియల్స్, రియాల్టీ షోలు ప్లాన్ చేస్తున్నట్లు నిహారిక చెప్పుకొచ్చారు.

సేవా భావం కూడా ఎక్కవే
నిహారికలో సేవా భావం కూడా ఉంది. త్వరలో వాలంటరీ ఆర్గనైజేషన్ మొదలు పెట్టి పేద విద్యార్థులకు విద్యా అందించడానికి ప్లాన్ చేస్తోందట.

నిహారిక, అఖిల్ గురించిన వార్తలు
నిహారిక, అఖిల్ గురించిన వార్తలు ఈ మధ్య చర్చనీయాంశం అయ్యాయి. ఇద్దరూ కలిసి ఒకే సినిమాలో నటిస్తారని, ఇద్దరూ ఒకే సారి పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్నారనే వార్తలు వచ్చాయి. అయితే వాటిపై ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు.


Click it and Unblock the Notifications











