చేతికి నిమ్మకాయలు దొరికితే అలా చేయాలంటోన్న మెగా డాటర్..
మెగా ఫ్యామిలీ నుంచి హీరోలు వస్తోన్న క్రమంలో నాగబాబు కూతురు నిహారిక కొణిదెల ఎంట్రీ ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపర్చింది. అయితే మెగా హీరోలు సక్సెస్ అయినట్టుగా మెగా హీరోయిన్‌గా స్టార్ డమ్‌ను మాత్రం తెచ్చుకోలేపోయింది.

వెండితెరపై సక్సెస్ కానీ నిహారిక..
ఒక మనసు చిత్రంలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక.. తమిళంలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. విజయ్ సేతుపతి హీరోగా చేసిన చిత్రంలో నటించిన నిహారికకు అది మిశ్రమ ఫలితాన్నే మిగిల్చింది. హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం అంటూ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఆశించిన విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది.

వెబ్ సిరీస్‌లతో హవా..
ముద్దపప్పు ఆవకాయ్, నాన్న కూచి లాంటి వెబ్ సిరీస్‌లతో ఆకట్టుకుంటోంది. బుల్లితెరపై సక్సెస్ అయిన నిహారిక.. సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌పై దూసుకుపోతోన్న నిహారిక వెండితెరపై మెప్పించలేకపోతోంది.

సోషల్ మీడియా ఫుల్ యాక్టివ్..
సినిమాలు, వెబ్ సిరీస్‌లను పక్కన పెట్టేస్తే.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తన కామెడీ టైమింగ్‌తో అందర్నీ నవ్విస్తూ ఉంటుంది. ఎక్కడికి వెళ్లినా అప్డేట్ చేస్తూ.. ఇష్టమైన పదార్థాలను తింటూ అందర్నీ ఊరిస్తూ ఉంటుంది.
తాజా పోస్ట్ వైరల్...
జీవితంలో నిమ్మకాయలు దొరికితే.. పక్క వారి కళ్లలో పిండేసి.. ఏం జరగనట్టు నవ్వాలి అంటూ నిహారిక ఓ సలహాను ఇచ్చింది. దీంతో పాటు షేర్ చేసిన పిక్ వైరల్ అవుతోంది. నిహారికి తాజాగా సైరా చిత్రంలో ఓ చిన్న పాత్రను పోషించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











