నిహారిక పెళ్లి కూతురు చీర స్పెషాల్టీ ఇదే.. 32 ఏళ్ల క్రితం నాటిదంటూ పోస్ట్
మెగా డాటర్ నిహారిక పెళ్లి సంబరాలు అంబరాన్నంటున్నాయి. డిసెంబర్ 9న నిహారిక చైతన్యలు మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కానున్నారు. అయితే పెళ్లికి వారం రోజులుండగానే సంబరాలు మొదలయ్యాయి. మెగా ఇంట్లో ఇప్పుడు నిహారిక పెళ్లి సందడి రచ్చ రచ్చగా జరుగుతోంది. ఇందులో అల్లు, మెగా ఫ్యామిలీలు దుమ్ములేపుతున్నారు. ఇళ్లంతా సందడి సందడిగా మారింది. మెగా సిస్టర్స్ మెగా గ్రాండ్ డాటర్స్ చేసే అల్లరి అంతా ఇంతా కాదు.

డిసెంబర్ 9న..
నిహారిక చైతన్యల పెళ్లి టాపిక్, మెగా సందడి, ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ ఇలా అన్నీ కూడా టాక్ ఆఫ్ ది టౌన్ అవుతున్నాయి. పెళ్లి వేదిక కూడా సిద్దమైంది. ఆసియాలోనే రెండో అతిపెద్ద ప్యాలెస్ అయిన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉన్న ఉదయ్‌విలాస్ నిహారిక పెళ్లికి వేదికైంది. డిసెంబర్ 9న రాత్రి అంగరంగ వైభవంగా వివాహాం జరగనుంది.

ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ అలా..
ప్రస్తుతం పెళ్లికి ముందుండే కార్యాక్రమాలన్నీ కూడా నాగబాబు ఇంట్లో రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వారోత్సవాలు జరిగనట్టుగా మోగా ఇంట్లో సందడి నెలకొంది. అల్లు, మెగా ఫ్యామిలీల కలయికతో ఇళ్లంతా పండుగ వాతావరణం నెలకొంది. పెళ్లికి సంబంధించిన పనులన్నీ వరుణ్ తేజ్ దగ్గరుండి మరీ చూసుకుంటున్నాడు.

పెళ్లి కూతురిని చేశారు..
నిహారికను నిన్న పెళ్లి కూతురిని చేశారు. ఈ ఈవెంట్‌లో మెగా సిస్టర్స్ అందరూ రచ్చ రచ్చ చేశారు. మరీ ముఖ్యంగా చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత, చిన్న కూతురు శ్రీజ ఫ్యామిలీలు హల్చల్ చేశాయి. ఇలా ముగ్గురు అక్కా చెల్లెళ్ల సందడి ఓ వైపు ఉండే.. మెగా గ్రాండ్ డాటర్స్ నివృత్తి, సంహిత, నవిష్కల సందడి మరో లెవెల్‌లో ఉంది.

మెగా సిస్టర్స్ పిక్స్..
నిహారికను పెళ్లి కూతురిగా రెడీ చేసిన తరువాత తన అక్కలతో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ముగ్గురు అక్కా చెల్లెళ్లు ఒకే ఫ్రేమ్‌లో కనిపించే సరికి అభిమానులకు పండుగలా అనిపించింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యాయి. అందులో నిహారిక వేసుకున్న బ్లూ కలర్ చీరపై అందరి కళ్లు పడ్డాయి. దాని కథను తాజాగా చెప్పింది.
Recommended Video

అమ్మ చీర అంటూ..
నిహారిక తనను పెళ్లి కూతురుని చేసినప్పుడు కట్టుకున్న చీరకు పెద్ద కథ ఉందట. నిహారిక అమ్మ పద్మజ తన నిశ్చితార్థం రోజు కట్టుకున్న చీరనే తాను ఇప్పుడు కట్టుకున్నానని చెప్పింది. ఈ చీర 32 ఏళ్ల క్రితం నాటిదని అసలు విషయం చెప్పింది. ఇక ఈ ఫోటోను చూసిన నెటిజన్లు తల్లీ కూతుళ్లు ఒకేలా ఉన్నారని కామెంట్లు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











