ఫేవరెట్ హీరో ఎవరో చెప్పేసిన నిహారిక.. పాన్ ఇండియా సూపర్ స్టార్‌తో మూవీ
తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దీనికి కారణం ఆ కుటుంబం నుంచి ఎంతో మంది సినీ రంగంలోకి ఎంట్రీ ఇవ్వడంతో పాటు వాళ్లలో చాలా మంది స్టార్లుగా హవాను చూపిస్తుండడమే. ఇక, ఈ ఫ్యామిలీ నుంచే వచ్చి తనదైన రీతిలో దూసుకుపోతోన్న వారిలో నిహారిక ఒకరు. నటిగా, యాంకర్‌గా, నిర్మాతగా సత్తా చాటుతోన్న ఈ చిన్నది.. వరుసగా ప్రాజెక్టులను తీసుకు వస్తూ సత్తా చాటుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో నిహారిక కొణిదెల టాలీవుడ్‌లో తన ఫేవరెట్ హీరో గురించి బయటపెట్టింది. ఆ వివరాల్లోకి వెళ్తే....
హీరోయిన్‌గా ఫెయిల్యూర్
టీనేజ్‌లో ఉన్నప్పుడే 'ఢీ' షోను హోస్ట్ చేసిన నిహారిక.. ఆ తర్వాత 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' అనే బ్యానర్‌పై 'ముద్దపప్పు ఆవకాయ్', 'నాన్న కూచీ' వంటి సిరీస్‌లు చేసింది. కొన్నేళ్ల అనంతరం 'ఒక మనసు' మూవీతో హీరోయిన్‌గా ఎంటరైంది. ఆ తర్వాత 'హ్యాపీ వెడ్డింగ్', 'సూర్యకాంతం' మూవీలు చేసింది. కానీ, ఇవి విజయాలను మాత్రం అందుకోలేదు.

డివోర్స్ తర్వాత నటిగా
హీరోయిన్‌గా నిహారిక అంతగా సక్సెస్ కాలేదు. ఫలితంగా ఆమె మూవీలకు బ్రేక్ ఇచ్చేసింది. ఈ క్రమంలోనే చైతన్యతో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత ఆమె యాక్టింగ్ కెరీర్‌ను ఆపేయాల్సి వచ్చింది. కానీ, నిర్మాతగా మాత్రం పలు సిరీస్‌లను చేసింది. ఇక, గత ఏడాది చైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత నిహారిక 'డెడ్ ఫిక్సల్' సిరీస్‌తో నటిగా రీఎంట్రీ ఇచ్చేసింది.
వరుస ప్రాజెక్టులు చేస్తూ
యాక్టింగ్ కెరీర్‌ను మరోసారి ప్రారంభించడంతో పాటు నిర్మాతగానూ దూసుకుపోతోన్న నిహారిక కొణిదెల.. ఈ మధ్య కాలంలో స్పీడు పెంచేసి మరీ కొత్త ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటూ వెళ్తోంది. ఇలా ఇప్పటికే కొన్ని వెబ్ సిరీస్‌లతో పాటు పలు చిత్రాలకు సైతం సంతకం పెట్టేసింది. ఇటీవలే ఆహాలో ప్రసారమైన 'చెఫ్ మంత్ర' షోను హోస్ట్ చేసి అలరించింది.

కమిటీ కుర్రాళ్లతో రెడీగా
ఒకవైపు నటిగా, హోస్టుగా అలరిస్తోన్న నిహారిక కొణిదెల.. నిర్మాతగానూ జెట్ స్పీడుతో దూసుకుపోతోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ అమ్మడు 'కమిటీ కుర్రాళ్లు' అనే సినిమాను నిర్మించింది. పూర్తి స్థాయి పల్లెటూరి స్టోరీతో రాబోతున్న ఈ చిత్రం ఆగస్టు 9వ తేదీన విడుదల కాబోతుంది. దీంతో నిహారిక ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్లలోనే ఎక్కువగా పాల్గొంటోంది.
ప్రభాస్‌తో మూవీ అంటూ
మెగా డాటర్ నిహారిక కొణిదెల తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా సదరు యాంకర్ 'మీ ఫ్యామిలీ హీరోలతో కాకుండా టాలీవుడ్‌లో ఏ హీరోతో మీరు సినిమా చేయాలని అనుకుంటున్నారు' అంటూ ప్రశ్నించింది. అదే సమయంలో 'ఎన్టీఆర్, మహేశ్ బాబు, ప్రభాస్' పేర్లను ఆప్షన్లుగా ఇచ్చింది. వీటిలో నిహారిక 'ప్రభాస్' పేరును చెప్పేసింది.

ఆ సినిమాలంటే ఇష్టం
ఆ తర్వాత నిహారిక కొణిదెల మాట్లాడుతూ.. 'నాకు ప్రభాస్ గారి కామెడీ అంటే ఇష్టం. ఆయన నటించిన డార్లింగ్ మూవీ చాలా నచ్చుతుంది. అలాగే, మిర్చి, మిస్టర్ పర్‌ఫెక్ట్ సినిమాలు కూడా చాలా ఇష్టం. ఒకవేళ అలాంటి సినిమాలు చేసి, నాకు అవకాశం వస్తే కచ్చితంగా నటిస్తాను' అని వివరించింది. దీంతో నిహారిక చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు బాగా హాట్ టాపిక్ అయ్యాయి.


Click it and Unblock the Notifications











