twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పొట్టి బట్టల్లో పిచ్చెక్కిస్తోంది.. నిహారికను ఎప్పుడూ ఇలా చూసి ఉండరు!

    |

    నిహారిక కొణిదెల తన పెళ్లి తరువాత చాలా మారిపోయింది. మరీ ముఖ్యంగా కట్టూబొట్టూ విషయంలో పూర్తిగా మారిపోయింది. పెళ్లికి ముందు అందాల ఆరబోతకు ఆమడ దూరంలో ఉండేది. కానీ పెళ్లి ఫిక్స్ అయ్యాక మాత్రం నిహారిక ఓ రేంజ్‌లో రచ్చ చేస్తోంది. అలా పొట్టి బట్టల్లో దర్శనమిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా ఆమె జిమ్‌లో తెగ కష్టపడిపోయింది. ఈ మేరకు జిమ్‌లో కష్టపడుతున్న ఫోటోను షేర్ చేయగా అది తెగ వైరల్ అవుతోంది.

    అందాల ఆరబోత..

    అందాల ఆరబోత..

    నిహారిక తెరపైనా, తెర వెనుకా ఎప్పుడూ కూడా అందాలను ప్రదర్శించింది. తాను చేసిన సినిమాలన్నింటిలోనూ పద్దతిగానే కనిపించింది. బుల్లితెరపై షోలు చేసినా, సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసినా కూడా నిండైన దుస్తులను ధరించేది. అయితే పెళ్లి నిశ్చయం అయ్యాక మాత్రం రూట్ మార్చేసి అందాల ఆరబోత చేస్తోంది.

    గోవాలో అలా..

    గోవాలో అలా..

    నిహారిక తన బ్యాచ్‌లర్ పార్టీ కోసం గోవాకు వెళ్లిన సంగతి తెలిసిందే. అలా తన గ్యాంగ్‌తో అక్కడ చేసిన రచ్చ.. ధరించిన దుస్తులు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఆ తరువాత మెగా ఇంట్లో జరిగిన పార్టీల్లోనూ నిహారిక పొట్టి బట్టల్లోనే దర్శనమిచ్చింది. ఇక హనీమూన్ పిక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

    పెళ్లి తరువాత..

    పెళ్లి తరువాత..

    నిహారిక తన పెళ్లికి ముందు కూడా చైతన్యతో కలిసి జిమ్‌కు వెళ్లేది. ఇద్దరూ కలిసి వ్యాయామం చేసేవారు. నిహారిక, లావణ్య త్రిపాఠి ఇలా అందరూ కలిసి వ్యాయామం చేస్తూ జీరో సైజ్‌లోకి వచ్చేశారు. అయితే నిహారిక తాజాగా ఓ వర్కవుట్ పిక్ షేర్ చేసింది.

    పొట్టి బట్టల్లో..

    పొట్టి బట్టల్లో..

    ఇక జిమ్‌లో వ్యాయామం చేసి బాగా అలిసిపోయిన నిహారిక.. చెమటలతో ఉన్న సెల్ఫీని షేర్ చేసింది. అయితే ఇందులో నిహారిక దుస్తులను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. బుల్లి నిక్కర్‌లో నిహారిక దర్శనమిచ్చేసరికి అంతా అవాక్కవుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో తెగ వైరల్ అవుతోంది.

    కొత్త వెబ్ సిరీస్..

    కొత్త వెబ్ సిరీస్..

    ఇక నిహారిక కొత్త వెబ్ సిరీస్ షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోన్న సంగతి తెలిసిందే. డే అండ్ నైట్ అనే తేడా లేకుండా షూటింగ్ సెట్‌లోనే నిహారిక ఉంటోంది. చాలా రోజుల తరువాత ఇలా సెట్స్‌లోకి రావడం ఎంతో ఆనందంగా ఉందని ఆ మధ్య చెప్పిన సంగతి తెలిసిందే.

    English summary
    Niharika konidela workouts in gym, Niharika and Anasuya In Rayudu Chitralu New Web series..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X