మురిపించిన మెగా తండ్రీ కూతుళ్లు: ఆకట్టుకుంటున్న "నాన్న కూచి" ట్రైలర్

మెగా ఫ్యామిలీలోని నాగేంద్రబాబు - ఆయన కుమార్తె నీహారిక మొదటిసారి తండ్రీకూతుళ్ల కథలో నటిస్తున్నారు. అయితే ఇది సినిమా కాదు.. వెబ్ సిరీస్.

Recommended Video

Here Is The Niharika ‘Nanna Kuchi’ Trailer "నాన్న కూచి" ట్రైలర్

మెగాస్టార్ ఈ పేరుకి ఉన్న క్రేజ్ ఎంతో స్పెషల్ గా ఇప్పుడు చెప్పేపని లేదు. ఆ పదం వినిపిస్తే చాలు ఎక్కడ లేని ఉత్సాహం తో తలలు తిప్పి చూస్తారు చిరు ఫ్యాన్స్, ఫ్యామిలీ మొత్తం నుంచీ అంతమంది హీరోలు వచ్చినా చిరంజీవి ఒక స్పెషల్, మెగా కాంపౌండ్ అన్న బేస్ చాలు ఇండస్ట్రీలో అమాంతం హీరో అయిపోవటానికి.అయితే ఇప్పటివరకూ హీరోలే వచ్చారు కానీ మెగా డాటర్ నీహారిక మాత్రం మొదటిసారి యాక్తింగ్ లోకి అడుగుపెట్టింది. అయితే ఆమె గ్లామర్ పాత్రలు చేయటం అంటే చిరు కుటుంబ సభ్యులే కాదు ముందు తెలుగు ప్రేక్షకులే అంగీకరించలేరు. అందుకే కేవలం పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉండే పాత్రలని మాత్రమే ఎంచుకుంటూ వస్తోంది నీహారిక.

 ముద్దపప్పు ఆవకాయ

ముద్దపప్పు ఆవకాయ

ఒక మనసు చిత్రం తర్వాత ఇప్పటి వరకూ ఒక్క సినిమా కూడా బయటికి రాలేదు. ప్రస్తుతం సుమంత్ అశ్విన్ పక్కన "హ్యాపీ వెడ్డింగ్" చిత్రంలో నటిస్తోంది. మరీ గ్లామర్ పాత్రలు చేసి, కెరీర్ నిలబెట్టుకోవాలన్న అవసరమూ లేదు కాబట్టి. సినిమాల్లోకి రాకముందు చేసిన ‘ముద్దపప్పు ఆవకాయ' లాగా ఇంకో వెబ్ సిరీస్ మొదలు పెట్టేసింది.

 తండ్రీకూతుళ్ల కథ

తండ్రీకూతుళ్ల కథ

మెగా ఫ్యామిలీలోని నాగేంద్రబాబు - ఆయన కుమార్తె నీహారిక మొదటిసారి తండ్రీకూతుళ్ల కథలో నటిస్తున్నారు. అయితే ఇది సినిమా కాదు.. వెబ్ సిరీస్. నాన్న కూచి పేరిట రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ ట్రయిలర్ ను నాగబాబు పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేశారు. సినిమాకు ఏ మాత్రం తీసిపోని క్వాలిటీతో ఈ వెబ్ సిరీస్ తీస్తున్నారని ట్రయిలర్ చూస్తే తెలిసిపోతోంది.

 తండ్రి కూతుళ్ల మధ్య అనుబంధం

తండ్రి కూతుళ్ల మధ్య అనుబంధం

అచ్చం ఫ్రెండ్స్ లా ఉండే ఆనందరాజ్ - తార అనే తండ్రి కూతుళ్ల మధ్య అనుబంధాన్ని ప్రతిబింబిస్తూ ఈ వెబ్ సిరీస్ తీశారు. ఇందులో నిహారికకు ఓ లవ్ స్టోరీ ఉంటే.. నాగబాబుకూ ఇంకో లవ్ స్టోరీ ఉండటం విశేషం. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పతాకంపై రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ కు నిర్మాత కూడా నీహారికనే.

 నాన్నకూచి

నాన్నకూచి

బి.ప్రణీత్ దర్శకత్వం వహిస్తున్నారు. మంచి మ్యూజిక్.. చక్కటి పిక్చరైజేషన్ తోపాటు డైలాగులు కూడా ఆకట్టుకునేలా ఉన్న నాన్నకూచి వెబ్ సిరీస్ అభిమానులను ఇట్టే ఆకట్టుకునేలానే ఉంది. మొత్తానికి లేటెస్ట్ ట్రెండ్ అయిన వెబ్ సిరీస్‌లకి కూడా స్టార్ స్టేటస్ తెచ్చే పనిలో పడిందన్నమాట నిహారిక.

రామ్ చరణ్, మెగాస్టార్ లతో

పనిలో పని రామ్ చరణ్, మెగాస్టార్ లతో రెండు క్యామియోలు గనక చేయిస్తే ఇక ఈ ఫార్మాట్ కూడా టీవీ సీరియళ్ళ రేంజి‌లో ఊపందుకుంటుందనటం లో సందేహం లేదు. ఇప్పటికే షార్ట్ ఫిలిం ట్రెండ్ కాస్త పాతబడి వెబ్ సిరీస్ లు ఎక్కువగానే వస్తున్న టైమ్ లో నిహారిక ప్రయోగం మెచ్చుకోదగిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X