Liger: విజయ్​ దేవరకొండతో నిహారిక ఫైట్​​.. చివరికీ పిల్లో ఫైట్​కు ఫిక్స్​.. ట్రెండింగ్​లో వీడియో

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్​ దేవరకొండ మోస్ట్​ ప్రిస్టేజియస్​ మూవీ లైగర్​. విజయ్​ దేవరకొండ సినీ కెరీర్​లో తొలి పాన్ ఇండియా చిత్రంగా వస్తున్న ఈ మూవీకి మాస్ డైరెక్టర్​ పూరి జగన్నాథ్​ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు ఈ మూవీ ఆగస్టు 25న వరల్డ్​వైడ్​గా విడుదల కానుది. సుమారు నెల రోజుల నుంచి లైగర్ మూవీ ప్రమోషన్స్​ జోరుగా సాగుతున్నది తెలిసిన విషయమే. వివిధ రాష్ట్రాల్లో సైతం లైగర్​ టీమ్​కు మంచి రెస్పాన్స్​ వచ్చింది. ప్రచారంలో భాగంగా అదిరిపోయే ప్రమోషన్​ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది. ఈ వీడియోలో విజయ్​ దేవరకొండతో నిహారిక చేసిన ఫైట్​ ఆకట్టుకునేలా ఉంది.

సిటీ మార్​ ఎంటర్​టైనర్​..

సిటీ మార్​ ఎంటర్​టైనర్​..

గురువారం అంటే ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానున్న లైగర్ సినిమా ఫస్ట్ రివ్యూ రానే వచ్చింది. రెండు విషయాల్లో తప్ప మిగతా మూవీ అంతా సీటి మార్​ ఎంటర్​టైనర్​ అని సెన్సార్​ బోర్డ్​ సభ్యుడు, ప్రముఖ క్రిటిక్​ ఉమర్​ సంధు సోషల్​ మీడియా వేదికగా తెలిపాడు.

ఆరోగ్యం బాగా లేకున్నా..

ఆరోగ్యం బాగా లేకున్నా..

ఇక ఇదిలా ఉంటే లైగర్​ మూవీ ప్రమోషన్స్​ను జోరుగా నిర్వహించారు. విజయ్​ దేవరకొండకు ఆరోగ్యం సరిగ్గా లేకున్నా ఈ ప్రమోషన్స్​లో పాల్గొన్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. రెండేళ్లు కష్టపడిన లైగర్​ కోసం ఇంకొన్ని రోజులు కష్టపడలేమా? అని అనుకున్నట్లు తెలిపాడు.

ఫైటింగ్​తో కామెడీ..

ఫైటింగ్​తో కామెడీ..

ఈ ప్రమోషన్స్​లో భాగంగానే ఇటీవల చేసిన ఓ ప్రమోషనల్​ వీడియో నెట్టింట వైరల్​ అవుతోంది. సోషల్​ మీడియా సెన్సేషనల్​ స్టార్​ ఎన్​ఎమ్​ నిహారిక ఈ వీడియోను రూపొందించింది. విజయ్ దేవరకొండతో ఫైటింగ్​ చేస్తూ కామెడీ పండించింది.

నత్తితో డైలాగ్​లు..

నత్తితో డైలాగ్​లు..

ఈ వీడియోలో విజయ్​ దేవరకొండతో ఫైటింగ్ చేస్తుంది నిహారిక ఎన్​ఎమ్​. అలా ఫైటింగ్​ మధ్యలో ఇద్దరు అరుచుకోవడం, లైగర్​ మూవీ తరహాలో విజయ్​ డైలాగ్​లు చెప్పడం, అలాగే నిహారిక నత్తితో మాట్లాడటం నవ్వు తెప్పిస్తుంది. తర్వాత అలసిపోయిన నిహారిక ఎస్కేప్​ అయ్యేందుకు ప్రయత్నిస్తుంది.

సిగ్గుతో వెళ్లిన నిహారిక..

సిగ్గుతో వెళ్లిన నిహారిక..

అయినా విజయ్ దేవరకొండకు నిహారిక ఎన్​ఎమ్​ దొరికిపోతుంది. తర్వాత 'ఫైట్ చేద్దామా?' అని విజయ్ దేవరకొండ అడగ్గా.. 'ఏం ఫైట్' అని నిహారిక తిరిగి ప్రశ్నిస్తుంది. అప్పుడు 'పిల్లో ఫైట్'​ అని విజయ్​ చెప్పగానే 'పిల్లో ఎవరిస్తారు? నేను నీ పిల్లో అవుతా' అంటూ సిగ్గుతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది నిహారిక.

సెలబ్రిటీలు ఫిదా..

ప్రస్తుతం ఈ వీడియో సోషల్​ మీడయాలో ట్రెండ్​ అవుతోంది. పలువురు సెలబ్రిటీలు సైతం ఈ వీడియోపై స్పందిస్తున్నారు. సుస్మితా కొణిదెల, ఇలియానా, సోనాల్ దేవ్​ రాజ్, నిఖిల్ తనీజాతో పాటు పలువురు ఈ వీడియో తమకు తెగ నచ్చినట్లు తెలిపారు.

ఇతర హీరోలతో కలిసి ప్రమోషన్స్​..

ఇతర హీరోలతో కలిసి ప్రమోషన్స్​..

ఇక నిహారిక ఎన్​ఎమ్ సినిమా ప్రమోషన్స్​లో భాగంగా​ హీరోలతో కామెడీ వీడియోలు చేస్తూ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇప్పటికే ఈ బ్యూటిఫుల్​ సోషల్​ మీడియా స్టార్​ కేజీఎఫ్​ 2, సర్కారు వారి పాట, మేజర్​, జెర్సీ (హిందీ), రన్​వే 34 వంటి తదితర సినిమాల హీరోలతో కలిసి ప్రమోషనల్​ వీడియోలు చేసింది.

సెలబ్రిటీలు సైతం ఫ్యాన్స్​

సెలబ్రిటీలు సైతం ఫ్యాన్స్​

నిహారిక ఎన్​ఎమ్​ కాలిఫోర్నియాలో చదువుకున్న దక్షిణాది భాషలపై మంచి పట్టు ఉంది. అందుకో తను మాట్లాడే సరళి అందరిని ఆకర్షిస్తుంది. ఈమె చేసే వీడియోలకు ఎంతో మంది సెలబ్రిటీలు సైతం నిహారికకు ఫ్యాన్స్​గా మారారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X