గిరిజన మహిళగా మెగా హీరొయిన్.. అందుకే సైరాలో నటించేది.. నిహారిక!
మెగా డాటర్ నిహారిక నటించిన హ్యాపీ వెడ్డింగ్ చిత్రం జూలై 28 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రమోషన్ కార్యక్రమాల్లో నిహారిక బిజీగా పాల్గొంటోంది. ఓ ఇంటర్వ్యూలో భాగంగా నిహారిక మాట్లాడుతూ సైరా చిత్రం గురించి ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించింది.
సైరా చిత్రం దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ లో రూపొందుతోంది. తాను సైరా చిత్రంలో కామియో రోల్ లో కనిపించబోతున్నానని నిహారిక తెలిపింది. గిరిజన అమ్మాయి పాత్రలో కనిపిస్తుందట. సైరా చిత్రంలో ప్రత్యేకంగా నటించడానికి నిహారిక కారణం తెలిపింది.

తెలుగు సినిమా చరిత్రలో వచ్చిన గొప్ప చిత్రాలలో సైరా చిత్రం ఒకటిగా నిలవబోతోంది. అలాంటి చిత్రంలో భాగం కావడానికే ఈ పాత్ర చేస్తున్నానని నిహారిక తెలిపింది. సైరా చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇక నిహారిక, సుమంత్అశ్విన్ జంటగా నటించిన హ్యాపీ వెడ్డింగ్ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి.


Click it and Unblock the Notifications











