Niharika Pregnant: తల్లి కాబోతున్న నిహారిక.. ఆ ఫొటోలతో అనుమానాలు.. అక్కా బావ ఎక్కడంటూ!

నిహారిక కొణిదెల.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. దీనికి కారణం ఈమె మెగా ఫ్యామిలీకి చెందిన అమ్మాయి కావడంతో పాటు దాదాపు దశాబ్ద కాలం పైగానే సినీ రంగంలో సత్తా చాటుతుండడమే. దీనికితోడు ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు తరచూ ఏదో ఒక విషయంలో హాట్ టాపిక్ అవుతోంది. ముఖ్యంగా ఆమె పర్సనల్ లైఫ్ గురించి ఎన్నో రకాల పుకార్లు షికార్లు చేస్తోన్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు నిహారిక కొణిదెల తల్లి కాబోతుందని ఓ ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం ఆమె తాజాగా చేసిన ఫొటోనే అని తెలిసింది. ఆ వివరాలేంటో మీరే చూడండి!

అలా వచ్చి.. ఆల్‌రౌండర్‌గా

అలా వచ్చి.. ఆల్‌రౌండర్‌గా

చిన్న వయసులోనే నిహారిక నిర్మాతగా మారి ఎన్నో షార్ట్ ఫిల్మ్‌లు నిర్మించింది. ఆ తర్వాత యాంకర్, నటిగా సందడి చేసింది. ఈ క్రమంలోనే సినిమాల్లోకి అడుగు పెట్టింది. కానీ, హీరోయిన్‌గా మాత్రం నిహారిక సక్సెస్ కాలేకపోయింది. దీంతో యాక్టింగ్ కెరీర్‌కు బ్రేక్ ఇచ్చేసి.. నిర్మాతగా కంటిన్యూ అవుతోంది. మొత్తం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆల్‌రౌండర్‌గా మంచి పేరును తెచ్చుకుంది.

చైతన్యతో పెళ్లి.. కెరీర్ కూడా

చైతన్యతో పెళ్లి.. కెరీర్ కూడా

2020లో నిహారిక.. చైతన్య జొన్నలగడ్డ అనే కుర్రాడిని పెళ్లాడింది. అయితే, వివాహం తర్వాత కూడా ఈ అమ్మడు తన కెరీర్‌ను కొనసాగిస్తూనే ఉంది. అయితే, ఈ మధ్య కాలంలో మెగా డాటర్ హీరోయిన్‌గా నటించకున్నా.. నిర్మాతగా వ్యవహరిస్తూ బిజీగా గడుపుతోంది. ఈ క్రమంలోనే తన బ్యానర్‌పై 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ', 'హలో వరల్డ్' వెబ్ సిరీస్‌లు నిర్మించి దూసుకుపోతోంది.

విడాకుల వార్తలతో హైలైట్‌

విడాకుల వార్తలతో హైలైట్‌

చైతన్య జొన్నలగడ్డను పెళ్లి చేసుకున్న తర్వాత నిహారిక కొణిదెల కెరీర్ పరంగా బిజీగా ఉన్నప్పటికీ.. తన వైవాహిక జీవితాన్ని కూడా ఎంతో సంతోషంగా గడుపుతూ వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆమె భర్తకు విడాకులు ఇవ్వబోతుందని ఈ మద్య జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం వీళ్లిద్దరూ సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో కావడమేనని తెలిసిందే.

కొత్త సిరీస్... డౌట్ మాత్రం

కొత్త సిరీస్... డౌట్ మాత్రం

ఈ మధ్య కాలంలో విడాకులకు సంబంధించిన వార్తలు జోరుగా ప్రచారం అవుతోండగానే.. మరోవైపు నిహారిక కొణిదెల ఉగాది పండుగ రోజున ఓ ప్రకటన చేసింది. అందులో ఈ మెగా డాటర్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతున్న 'డెడ్ పిక్సెల్' అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నట్లు తెలిపింది. కానీ, విడాకులపై మాత్రం రెస్పాండ్ కాలేదు. దీంతో అందరిలో ఆ డౌట్ అలాగే ఉంది.

సోషల్ మీడియాలో బిజీగా

సోషల్ మీడియాలో బిజీగా

కెరీర్ పరంగా, పర్సనల్ లైఫ్ పరంగా ఎలా ఉన్నా.. మెగా డాటర్ నిహారిక కొణిదెల మాత్రం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గానే ఉంటోంది. ఈ మధ్య కాలంలో మరింత బిజీగా మారిపోయిన ఈ చిన్నది.. తరచూ తనకు సంబంధించిన విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తోంది. తద్వారా క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంటోంది.

మామిడి ముక్క.. ప్రెగ్నెంట్

మామిడి ముక్క.. ప్రెగ్నెంట్


సోషల్ మీడియాలో విపరీతంగా సందడి చేస్తోన్న నిహారిక కొణిదెల తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో మామిడికాయ ముక్కలను తింటోన్న కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అంతేకాదు, సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిందని చెప్పుకొచ్చింది. కానీ, నిహారిక తల్లి కాబోతుందని, అందుకే మామిడికాయలు తింటూ హింట్ ఇచ్చిందని ప్రచారం మొదలైంది. దీంతో ఈ న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది.

నువ్వు ప్రెగ్నెంటా? బావెక్కడ?

నువ్వు ప్రెగ్నెంటా? బావెక్కడ?

నిహారిక కొణిదెల మామిడికాయల ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్పందన వస్తోంది. ఈ పోస్టు కింద ఎక్కువగా ఆమె ప్రెగ్నెంటే అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కొందరైతే 'నిహారికా.. నువ్వు నెల తప్పావా' అని సూటిగా ప్రశ్నిస్తూ కామెంట్లు చేశారు. అంతేకాదు, 'అక్కా.. బావ ఎక్కడ?', 'నువ్వు విడాకులు తీసుకోవద్దు' అంటూ ఆమె డివోర్స్ గురించి కూడా రిప్లైలు ఇస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X