twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పెళ్లికి ముందే కండీషన్స్ పెట్టారా?.. ఆ సినిమా నుంచి తప్పుకుంటూ నిహారిక సంచలన నిర్ణయం

    |

    మెగా డాటర్ నిహారిక గురించి తెలుగు ప్రేక్షకులు అంతా తెలిసింది. బుల్లితెరపై యాంకర్‌గా అందరి మనసులను దోచుకుంది. ఆపై వెబ్ సిరీస్‌లతో సక్సెస్ కొట్టింది. ఇక వెండితెరపై మెరవాలన్న కోరికను తీర్చేసుకుంది. అయితే అనుకున్న సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. ఎన్ని సార్లు ప్రయత్నించినా ఏ ఒక్క చిత్రం కూడా వర్కౌట్ కాలేదు. ఇక కెరీర్‌కు స్వస్తి చెప్పి పెళ్లి చేసుకుని సెటిల్ అవుదామని ఫిక్స్ అయినట్టు కనిపిస్తోంది.

    వరుసగా ఫ్లాపులే..

    వరుసగా ఫ్లాపులే..

    ఒక మనసు, హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం ఇలా ప్రతీ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతూనే వచ్చింది. తెలుగులో ఇలా ఉందని తమిళంలోనూ విజయ్ సేతుపతి వంటి స్టార్‌తో చేసిన చిత్రం కూడా వర్కౌట్ కాలేదు. అలా తమిళం తెలుగులోనూ నిహారిక సక్సెస్ కాలేకపోయింది. ఇక చివరగా ఓ ప్రయత్నం చేద్దామని భావించినట్టు తెలుస్తోంది. కానీ అంత లోపే విధి వేరేలా ప్లాన్ చేసింది.

    ఓ తమిళ ప్రాజెక్ట్..

    ఓ తమిళ ప్రాజెక్ట్..

    నిహారిక కొణిదెల తదుపరి ప్రాజెక్ట్‌పై ఆ మధ్య తెగ వార్తలు వచ్చాయి. వాటిపై స్పందిస్తూ.. ‘అవును నిజమే.. నేను ఎంతో ఆత్రుతగా ఉన్నాను.. షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందా? అని ఆగలేకపోతోన్నా.. నా నెక్ట్స్ చిత్రం అశోక్ సెల్వన్‌ ( ఓ మై కడవలే ఫేమ్)తో ఉంటుంది.. స్వాతిని దర్శకురాలిగా పరిచయం అవుతోంద'ని ఎంతో సంతోషంగా చెప్పుకొచ్చింది.

    దర్శకురాలితో ప్రయాణం..

    దర్శకురాలితో ప్రయాణం..

    ఇక ఈ ప్రాజెక్ట్ చేద్దామని దర్శకురాలితో బాగానే ప్రయాణం చేసింది. చీటికి మాటికి చెన్నై కూడా వెళ్లివచ్చేది. వీరిద్దరి మధ్య స్నేహం కూడా బాగానే చిగురించింది. అయితే అనుకోకుండా పెళ్లి కుదరడంతో ఈ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చినట్టు తెలుస్తోంది. ఇలా నిహారిక తప్పుకున్న విషయాన్ని, ఆమె పాత్రకు మేఘా ఆకాష్‌ను తీసుకున్న వార్తలపై దర్శకురాలు అధికారికంగా స్పందించి వాటిని ధృవీకరించింది.

    Recommended Video

    Niharika Engagement : నిరాడంబరం గా వేడుక, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా Allu Arjun || Oneindia Telugu
    ఒక్క సినిమాకు కూడా ఒప్పుకోలేదా?

    ఒక్క సినిమాకు కూడా ఒప్పుకోలేదా?

    పెళ్లి తరువాత సినిమాల్లో నటించకూడదని ముందుగా కండీషన్ పెట్టినట్టు కనిపిస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ మాత్రం ఎప్పుడో నిర్ణయించిందే కదా? ఈ ఒక్క సినిమా కోసం కూడా వారు ఒప్పుకోలేదా? అని టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనా నిహారిక ఇక సినీ కెరీర్‌కు స్వస్తి చెప్పినట్టు తెలుస్తోంది. కనీసం వెబ్ సిరీస్‌లైనా చేసుకుంటుందా? లేదా? అన్నది చూడాలి.

    English summary
    Niharika Quit From Ashok Selvan Movie. Welcome on board the pretty Megha Wishing you a happy married life Niha niharikakonidela
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X