»   »  కొణిదెల నిహారిక ‘ముద్దపప్పు ఆవకాయ’ (ఫస్ట్ లుక్)

కొణిదెల నిహారిక ‘ముద్దపప్పు ఆవకాయ’ (ఫస్ట్ లుక్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాగ బాబు కూతురు నిహారిక ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' పేరుతో కొత్త ప్రొడక్షన్ మొదలు పెట్టింది. ఈ ప్రొడక్షన్లో యూట్యూడ్ సీరీస్ ఎంటర్టెన్మెంట్ కార్యక్రమాల రూపొందించనున్నారు. తాజాగా ‘ముద్దపప్పు ఆవకాయ' పేరుతో ఓ యూట్యూడ్ సిరీస్ ప్రారంభించారు. తాజాగా అందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేసారు.

‘ముద్ద పప్పు ఆవకాయ' ట్రైలర్ నాగబాబు గురువారం సాయంత్రం విడుదల చేసారు. అయితే గురువారం రాత్రి నుండి ఆ ట్రైలర్ అందరికీ అందుబాటులోకి రానుంది. నిహారిక క్లోజ్ ఫ్రెండ్ ప్రణీత్ బ్రామందపల్లి దర్శకత్వంలో ‘ముద్దపప్పు ఆవకాయ' పేరుతో యూట్యూబ్ సిరీస్ ప్రసారం కానుంది.

‘ముద్దపప్పు ఆవకాయ'లో నిహారిక ఆశా పాత్రలో మెయిల్ రోల్ చేయబోతున్నట్లు సమాచారం. ఇందులో మరో ముఖ్యమైన పాత్ర అర్జున్ పాత్రలో మరొక వ్యక్తి నటిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

అమృతం సీరియల్ తరహాలో ‘ముద్ద పప్పు ఆవకాయ' అనేది ఎంటర్టెన్మెంట్ సిరీస్ అని తెలుస్తోంది. ఎపిసోడ్లుగా ఎంటర్టెన్మెంట్ పంచే విధంగా దీన్ని డిజైన్ చేనట్లు తెలుస్తోంది. త్వరలో నిహారిక ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనుంది. అయితే ఇందులో అర్జున్, ఆశా అనే రెండు క్యారెక్టర్లు కీలకంగా ఉండనున్నాయని స్పష్టమవుతోంది.

ముద్దపప్పు ఆవకాయ

ముద్దపప్పు ఆవకాయ


నిహానిక కొణిదెల ‘ముద్ద పప్పు ఆవకాయ' ఫస్ట్ లుక్

నిహారిక

నిహారిక


మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చదివిన నిహారిక... యాంకర్ గా తన సత్తాచాటడంతో పాటు యూనిక్ ఎక్స్‌పర్మెంటుతో ప్రొడక్షన్ రంగంలోకి దిగుతోంది. ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' పేరుతో నిహారిక కొత్త ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించింది.

యూట్యూబ్ సిరీస్

యూట్యూబ్ సిరీస్


ప్రస్తుతానికి ఇది సినిమాలు నిర్మించేంత పెద్ద ప్రొడక్షన్ సంస్థ కాదు. ప్రస్తుతం తన సొంత ప్రొడక్షన్ మీద యూట్యూబ్ సిరీస్‌ ప్రారంభించింది నిహారిక.

దర్శకత్వం

దర్శకత్వం


తన క్లోజ్ ఫ్రెండ్ ప్రణీత్ బ్రామందపల్లి దర్శకత్వంలో ‘ముద్దపప్పు ఆవకాయ' పేరుతో యూట్యూబ్ సిరీస్ మొదలెట్టింది.

English summary
"The short yet long wait is finally over. Here, take a look at this in a flash. The poster release of our new Web series "MUDDAPAPPU AVAKAI". Trailer releasing tonight." Niharika said.
Please Wait while comments are loading...