‘ఒక మనసు’ చిత్రానికి క్లీన్‌ రిపోర్ట్, నిహారిక హ్యాపీ

By Bojja Kumar

హైదరాబాద్: మెగా డాటర్ నిహారిక, నాగ శౌర్య జంటగా... TV 9 సమర్పణలో, మధుర ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై రామరాజు దర్శకత్వంలో మధుర శ్రీధర్ రెడ్డి నిర్మించిన ఒక మనసు చిత్రం జూన్ 24 న విడుదలకు సిద్ధమవుతోంది. హార్ట్ టచింగ్ లవ్ స్టోరీతో తెరకెక్కిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని క్లీన్ 'యు' సర్టిఫికేట్ పొందింది.

ఇటివలే మెగా హీరోల చేతుల మీదుగా విడుదలైన 'పాటలకు శ్రోతలనుండి విశేష స్పందన లభిస్తోందని, సినిమా ఫస్ట్ లుక్ మొదలుకుని ఇటివలే విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ వరకూ ప్రేక్షకుల నుంచి లభిస్తున్న అనూహ్యమైన స్పందన తమకెంతో ఆనందాన్ని కలిగిస్తుందని చిత్ర నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి తెలిపారు.

Niharika's Oka Manasu censor report

ఇప్పటి రొటీన్ చిత్రాలకి విభిన్నంగా ఒక హృద్యమైన ప్రేమకధతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రంలో నిహారిక, నాగ శౌర్యల నటన ఆకట్టుకుంటుందనీ, ప్రేమ, కుటుంబం, బాధ్యతలు వాటి విలువలు లాంటి అంశాలతో ముడిపడివున్న ఈ ఒక మనసు సినిమా ప్రతి మనసుని అలరిస్తుందని, సునీల్ కశ్యప్ బాణీలు అందించిన ఈ చిత్రాన్ని జూన్ 24 వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని దర్శకుడు రామరాజు తెలిపారు.

'ఒక మనసు' సినిమా రిజల్టు మీదనే నిహారిక సినీ భవితవ్యం ఆధారపడి ఉంది. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చి, నిహారికకు మంచి పేరు వస్తేనే ఆమె సినిమాల్లో కొనసాగే అవకాశం ఉంది. ఏదైనా తేడా వస్తే నిహారిక మళ్లీ తెరపై కనపించే అవకాశం లేదని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X