twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కళ్యాణ్ రాజకీయాలపై నిహారిక కామెంట్.. అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అంటూ..

    |

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు రాజకీయాల్లో కూడా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రాజకీయ నాయకులు అంటే కేవలం విమర్శలు చేస్తూ ఓట్ల కోసం ప్రయత్నించే వారు మాత్రమే కాదు అధికారంలో లేకపోయినా కూడా వీలైనంత వరకు కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేసేవారు కూడా అని పవన్ కళ్యాణ్ నిరూపిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ పొలిటికల్ అంశాలపై ఇటీవల నాగబాబు కూతురు సోషల్ మీడియాలో స్పందించిన విధానం వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

    ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో కొంత మంది కౌలు రైతులు అప్పుల బాధ భరించలేక ఆర్థిక నష్టాలు కలగడంతో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవడానికి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఒక మంచి కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. వారికి అండగా ఉండేందుకు విరాళాలు సేకరిస్తున్నారు.

    Niharika special thanks tweet on janasena pawan kalyan letter

    అయితే పవన్ కళ్యాణ్ తన కుటుంబ సభ్యులను కూడా ఇందులో భాగం చేశారు. మెగా ఫ్యామిలీ నుంచి ఏకంగా 35 లక్షల విరాళం సేకరించారు. వరుణ్ తేజ్ 10 లక్షల రూపాయలు ఇవ్వగా సాయిధరమ్ తేజ్ మరో పది లక్షలు ఇచ్చారు. అలాగే వైష్ణవ్ తేజ్ ఐదులక్షల ఐదులక్షలు, నిహారిక 5 లక్షల విరాళాలు ప్రకటించారు. మొత్తంగా మెగా ఫ్యామిలీ నుంచి 35 లక్షల రూపాయల విరాళాలు సేకరించి రైతు కుటుంబాలకు సహాయం చేశారు.

    అయితే అందుకు పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా విరాళాలు ఇచ్చిన వారి కుటుంబ సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలిపారు. ఇక ఆ విషయంపై స్పందించిన నిహారిక కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది. చాలా థాంక్స్ కళ్యాణ్ బాబాయ్ అంటూ.. ప్రజలకు సహాయం చేయడానికి మాకు కూడా కొంత అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను ఎల్లప్పుడూ ఎదురు చూసే ఒక మంచి నాయకుడు మీరు. జనాలకు మంచి రోజులు తీసుకు రావడం మీ వల్లనే సాధ్యమవుతుంది అని నమ్ముతున్నాను.. అంటూ నిహారిక తన ట్విట్టర్లో పేర్కొన్నారు.

    English summary
    Niharika special thanks tweet on janasena pawan kalyan letter
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X