'ఉప్పెన' రొమాంటిక్ సాంగ్.. చాలా ప్రొఫెషినల్‌గా చేశావ్‌రా.. వైష్ణవ్‌ను ఆడుకున్న నిహారిక, వరుణ్ తేజ్
భారీ స్థాయిలో బజ్ క్రియేట్ చేసి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఉప్పెన సినిమా మొత్తానికి బాక్సాఫీస్ వద్ద సాలీడ్ వసూళ్లను అందుకుంటోంది. మొదటి రోజే రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ అందుకున్న ఉప్పెన ఆ తరువాత రోజు కూడా అదే ఫ్లోను కొనసాగిస్తోంది. చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద ఊహించని విదంగా రికార్డు క్రియేట్ చేసేలా ఉందని టాక్ వస్తోంది. ఇక సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా వైష్ణవ్ తేజ్ ను సరదాగా ఇంటర్వ్యూ చేశారు నిహారిక, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్.. ఇక ఆ ఇంటర్వ్యూలో వైష్ణవ్ ను వాళ్ళు ఒక ఆటాడుకున్నారు.

ఆ సాంగ్ పై పాజిటివ్ కామెంట్స్
ఉప్పెన సినిమాలో జల జల జల పాతం సాంగ్ మేకింగ్ పై పాజిటివ్ కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఆ సాంగ్ లో వైష్ణవ్, కృతి ఇచ్చిన పెర్ఫామెన్స్ వెండితెరను హీటెక్కిస్తుంది. ఎక్కడా కూడా వల్గర్ గా అనిపించకుండా చాలా రొమాంటిక్ తో కూడిన ఫీల్ ను కలిగించారు. వైష్ణవ్, కృతి కొత్తవారైనా కూడా అద్భుతంగా చేశారని క్లాప్స్ పడుతున్నాయి.

గుచ్చి గుచ్చి అడిగారు.
ఇక వైష్ణవ్ తేజ్ ను మొదటిసారి నిహారిక ఇంటర్వ్యూ చేయగా వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ కూడా పలు ప్రశ్నలతో వైష్ణవ్ ను ఇరకాటంలో పెట్టేశారు. ముఖ్యంగా సినిమాలో రొమాంటిక్ సాంగ్ జల జల జలపాతం నువ్వు సాంగ్ ఏ రేంజ్ లో క్లిక్కయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ఆ పాట గురించే వైష్ణవ్ ను గుచ్చి గుచ్చి అడిగారు.

ప్రొఫెషినల్ గా చేశావు
ముందుగా నిహారిక అయితే నీకు సాంగ్ ఎప్పటికి గుర్తుంటాదా ఉండదా? అంటూ వైష్ణవ్ ను సిగ్గు పడేలా చేసింది. మరోవైపు నుంచి సాయి ధరమ్ తేజ్ వరుణ్ తేజ్ కూడా చాలా ప్రొఫెషినల్ గా చేశావు అని ప్రశ్నలతో ఊపిరాడనివ్వకుండా చేశారు. ఆ దెబ్బతో వైష్ణవ్ తేజ్ కు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు.

నువ్వు ఏంట్రా అసలు..
సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. మేము హీరోయిన్స్ తో చాలా ఇబ్బంది పడతాం. నువ్వు ఏంట్రా అసలు ఇబ్బంది కూడా పడలేదు అని కామెంట్ చేశాడు. ఇక నిహారిక అయితే చూసి నేర్చుకోండి మంచి ఒక మంచి యాక్టర్ గా పెర్ఫెమెన్స్ ఇచ్చాడు అని వరుణ్, సాయిలకు కౌంటర్ ఇచ్చింది. నేనైతే హీరోయిన్ ను మూడో సినిమాలో కలిశాను అంటూ మరోవైపు వరుణ్ కూడా కౌంటర్ ఇచ్చాడు.

ఆ సాంగ్ షూట్ లో ఎవరు లేరు
ఇక ఫైనల్ గా వారి గోల తట్టుకోలేక వైష్ణవ్ అందరికి ఒకే తరహాలో సమాధానం చెప్పేశాడు. ఆ సాంగ్ బృందా మేడం కొరియోగ్రాఫ్ చేశారు. అసలు షూటింగ్ జరుగుతున్నప్పడు సెట్స్ లో ఎవరు లేరు. అందరిని పంపించేశారు. చాలా తక్కువ మంది ఉన్నారు అంటూ వైష్ణవ్ కూల్ గా వివరణ ఇచ్చాడు.
Recommended Video
మెగా ఫ్యామిలీలో ఫుల్ జోష్
సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన సినిమా శుక్రవారం విడుదలై సక్సెస్ ట్రాక్ లో వెలుతోంది. ఇక ఇప్పటికే మెగా ఫ్యామిలీ మొత్తం సినిమాను చూసేశారు. ఈ విజయంతో మెగా ఫ్యామిలీలో ఫుల్ జోష్ కనిపిస్తోంది. వీలైనప్పుడల్లా మెగాస్టార్ చిరంజీవి నుంచి అకిరా వరకు అందరూ స్పెషల్ షో వేయించుకొని మరి సినిమా చూసేస్తున్నారు.


Click it and Unblock the Notifications











