twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తనపై సినిమాను ఆపేయాలని కోర్టుకెక్కిన నీరా రాడియా

    By Pratap
    |

    తన జీవిత గాథ ఆధారంగా తెరకెక్కించిన 'మోనికా-ద పొలిటిక్స్‌ ఆఫ్‌ మర్డర్‌' చిత్రం విడుదలను నిలిపివేయించాలని కోరుతూ కార్పొరేట్‌ పైరవీకారణి నీరా రాడియా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం విడుదలకు సిద్ధమవుతున్న చిత్రంలో తన వ్యక్తిగత జీవితాన్ని అశ్లీలకరంగా చూపించే ప్రయత్నం చేశారని ఆమె తన పిటిషన్‌లో ఆరోపించారు.

    దీనివల్ల సమాజంలో తన ప్రతిష్ఠకు భంగం వాటిల్లుతుందని, పూడ్చుకోలేని నష్టం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్‌ జైన్‌ చిత్ర నిర్మాత, లక్నో కాంగ్రెస్‌ నేత కుష్‌ భార్గవకు నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణసమయంలో చిత్ర స్క్రిప్ట్‌, సీడీని తమకు సమర్పించాలని ఆదేశించారు.

    English summary
    Corporate Niira Radia on Thursday approached the Delhi HC against the release of a movie allegedly based on her life, on the ground that the film portrays her in a "scandalous" manner.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X