టాలీవుడ్లో లైంగిక వేధింపులు, బాయ్ ఫ్రెండ్ వదిలేశాడు: పవన్ హీరోయిన్ సంచలనం!

By Bojja Kumar

Recommended Video

లైంగిక వేధింపుల్లో పవన్ హీరోయిన్ !

హాలీవుడ్లో హార్వీ వెయిన్‌స్టన్ సంఘటన తర్వాత సినిమా పరిశ్రమల్లో లైంగిక వేధింపులు, కాస్టింగ్ కౌచ్ అంశంపై తరచూ ఏదో ఒక చర్చ జరుగుతోంది. హీరోయిన్లు ఏదైనా ఇంటర్వ్యూలో పాల్గొన్నపుడు కాస్టింగ్ కౌచ్ గురించి తప్పకుండా ఓ ప్రశ్న ఎదురవ్వడం, దానికి వారు తమకు ఎదురైన సంఘటనల గురించి చెప్పడం జరుగుతోంది.

పవన్ కళ్యాణ్ 'కొమురం పులి' సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయమైన నికీషా పటేల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ గురించి సంచలన కామెంట్స్ చేశారు.

టాలీవుడ్లోనూ అదే పరిస్థితి, మా నాన్న ఫోన్ చేస్తే ఏమీ చెప్పలేక పోయా

టాలీవుడ్లోనూ అదే పరిస్థితి, మా నాన్న ఫోన్ చేస్తే ఏమీ చెప్పలేక పోయా

హాలీవుడ్లో హార్వీ వెయిన్‌స్టన్ సంఘటన జరిగినపుడు మా నాన్న నాకు ఫోన్ చేసి టాలీవుడ్లో పరిస్థితి ఏమిటని ఆరా తీశారని, అపుడు ఆయనకు ఇక్కడ అలాంటిదేమీ లేదనే సమాధానం చెప్పలేక పోయానని, టాలీవుడ్లోనూ అలాంటి పరిస్థితులు ఉన్నాయని నికీషా పటేల్ తెలిపారు.

వేధింపుల్లో హాలీవుడ్‌కి, టాలీవుడ్‌కి తేడా లేదు

వేధింపుల్లో హాలీవుడ్‌కి, టాలీవుడ్‌కి తేడా లేదు

సెక్సువల్ వేధింపుల విషయంలో హాలీవుడ్ పరిశ్రమకు, టాలీవుడ్ పరిశ్రమకు పెద్దగా తేడా ఏమీ లేదని నికీషా పటేల్ తెలిపారు. అవకాశాల కోసం ఆ విషయంలో కాంప్రమైజ్ కావాలని కోరేవారు చాలా మంది ఇక్కడ ఉన్నారని నికీషా పటేల్ తెలిపారు. అలాంటి అన్ ప్రొఫెషనల్ పీపుల్‌లో ఆడవారు కూడా ఉన్నారని నికీషా వెల్లడించారు.

ఎస్టాబ్లిష్ అయిన వారికి అలాంటివి తక్కువే

ఎస్టాబ్లిష్ అయిన వారికి అలాంటివి తక్కువే

అయితే ఇంస్ట్రీలో ఎస్టాబ్లిష్ అయిన హీరోయిన్లకు అలాంటి వేధింపులు చాలా తక్కువ. బాగా పాపులారిటీ ఉన్నవారు అసలు అలాంటివి ఎదుర్కొని ఉండక పోవచ్చు. అయితే అవకాశాల కోసం స్ట్రగుల్ అయ్యే వారికి మాత్రం ‘కాస్టింగ్ కౌచ్' లాంటి సంఘటనలు తరచూ ఎదురవుతాయని నికీషా పటేల్ తెలిపారు.

ఎన్నో డ్రీమ్స్ తో ఇక్కడికి వస్తాం

ఎన్నో డ్రీమ్స్ తో ఇక్కడికి వస్తాం

ప్రతి ఒక్కరూ ఎన్నో డ్రీమ్స్‌తో ఇండస్ట్రీకి వస్తారు. కొన్ని మంచి సినిమాలు చేసిన తర్వాత కూడా, కొందరు అన్ ప్రొఫెషనల్ వ్యక్తుల కారణంగా నటీమణులు ఆఫర్లు తీసుకోవడానికి ఇష్టపడటం లేదు. కొందరైతే నటీమణులకు రెస్పెక్ట్ అనేది ఇవ్వరు అని నికీషా పటేల్ తెలిపారు.

అందుకే బాయ్ ఫ్రెండ్ వదిలేశాడు

అందుకే బాయ్ ఫ్రెండ్ వదిలేశాడు

తన పర్సనల్ లైఫ్ విషయాల గురించి నికీషా వెల్లడిస్తూ.... సినిమాల్లోకి రావడానికి ముందు తనకు బాయ్ ఫ్రెండ్ ఉండేవాడని, అయితే తాను నటిని కావడం వల్లే తనను వదిలేశాడని నికీషా తెలిపారు. నటిని పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని చెప్పి తనను వదిలివెళ్లి పోయాడని నికీషా పటేల్ తెలిపారు.

నికీషా పటేల్ చేస్తున్న సినిమాలు

నికీషా పటేల్ చేస్తున్న సినిమాలు

యూకెలో పుట్టి పెరిగిన నికీషా పటేల్ 2010లో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘కొమురం పులి' సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అయింది. అయితే ఆ సినిమా ప్లాప్ కావడంతో అమ్మడి తొలి సినిమాతోనే పెద్ద దెబ్బ పడింది. తర్వాత తెలుగులో చేసిన ఓం 3డి, అరకు రోడ్డులో చిత్రాలు కూడా ఆడలేదు. ప్రస్తుతం తమిళంలో 7 నాటకల్ అనే సినిమా చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X