నాటి దెబ్బకు ఒళ్లు దగ్గర పెట్టుకున్న హీరోయిన్.. పవన్ బర్త్ డేకు ఈ సారి సరైన హ్యాష్‌ట్యాగ్‌నే వాడింది

సోషల్ మీడియాలో ఒక్కోసారి పొరబాటు జరిగిపోతుంది. అది తెలిసేలోపే జరగాల్సిన నష్టం మొత్తం జరుగుతుంది. సోషల్ మీడియాలో ముఖ్యంగా ఏదైనా ఓ విషయం మీద ట్రెండ్ జరుగుతూ ఉంటే దానిపై కాసింత అవగాహన ఉండాల్సిందే. లేదంటా ఘోరమైన పరాభావం తప్పదు. గతేడాది పవన్ కళ్యాణ్ బర్త్ డే నాడు నికీషా పటేల్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆ దెబ్బతో ఈసారి ఆ తప్పును పునరావృత్తం కాకుండా చూసుకుంది. అసలేం జరిగిందంటే..

 తప్పు హ్యాష్ ట్యాగ్..

తప్పు హ్యాష్ ట్యాగ్..

గతేడాది పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో నెగెటివ్ ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు. పవన్ కళ్యాణ్ అనే హ్యాష్ ట్యాగ్ దేశ వ్యాప్తంగా ట్రెండ్ అవుతూ ఉంటే మరోవైపు పావలా కళ్యాణ్ అనే హ్యాష్ ట్యాగ్‌ను యాంటీ ఫ్యాన్స్ ట్రెండ్ చేశారు. ఇది గమనించుకోని నికీషా తొందర్లో ఓ తప్పు చేసింది.

డిలీట్ చేసినా సరే..

డిలీట్ చేసినా సరే..

పావలా కళ్యాణ్ అనే మీనింగ్ తెలియకనో, అసలు అది కరెక్ట్ ట్యాగ్ అని గమనించకనో ఏమో గానీ బర్త్ డే విషెస్ చెప్పే తొందరలో తప్పు హ్యాష్ ట్యాగ్‌ను వాడేసింది. ఇక తన హీరోయిన్ కూడా పవన్ కళ్యాణ్ అలా అనేసిందని నికీషాను ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. తప్పు తెలుసుకున్న నికీషా.. ఆపై ట్వీట్ డిలీట్ చేసి కొత్త ట్వీట్ వేసింది. కానీ అప్పటికే నష్టం జరిగిపోయింది.

 ఒళ్లు దగ్గరపెట్టుకుంది..

ఒళ్లు దగ్గరపెట్టుకుంది..

ఈ సారి మాత్రం నికీషా ఒళ్లు దగ్గరపెట్టుకున్నట్టు కనిపిస్తోంది. కరెక్ట్ హ్యాష్ ట్యాగ్‌లను వాడి.. ఆ విషయాన్ని నొక్కి మరీ చెప్పింది. ‘హ్యాపీ బర్త్ డే పవన్ కళ్యాణ్.. మీరెప్పుడూ నవ్వుతూ, సంతోషంగా ఉండాలి.. మీరెప్పుడూ నన్ను విష్ చేయకపోయినా సరే ప్రతీ ఏడాది మీ బర్త్ డేను గుర్తు పెట్టుకుంటాను' అంటూ ఈ సారి కరెక్ట్ హ్యాష్ ట్యాగ్‌కు కూడా వాడాను అని చెప్పుకొచ్చింది.

Recommended Video

Chittoor V Nagaiah 'భక్త పోతన' చూసి.. కనకాభిషేకం చేసిన మైసూర్ మహారాజు
పవన్ రిప్లైతో..

పవన్ రిప్లైతో..

ఈ సారి పనవ్ కళ్యాణ్ తనకు విషెస్ చెప్పిన ప్రతీ ఒక్కసెలెబ్రిటికీ పేరు పేరునా థ్యాంక్స్ చెప్పాడు. ఈ మేరకు నికీషాకు రిప్లై ఇస్తూ.. విషెస్ చెప్పినందుకు థ్యాంక్స్ నికీషా.. నీ కెరీర్ బాగుండాలి అంటూ కోరుకున్నాడు. అలా పవన్ రిప్లై ఇవ్వడంతో నికీషా గాల్లో తేలిపోయింది. రిప్లై ఇచ్చినందుకు థ్యాంక్స్ పవన్ కళ్యాణ్ సర్.. ఎంతో నిరాడంబరంగా ఉండే సూపర్ స్టార్.. రాజకీయాల్లోనూ భవిష్యత్ నాయకుడు అవుతాడు.. అంటూ నికీషా ట్వీట్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X