ప్రభుదేవాతో నికిషా పటేల్ మ్యారేజ్ రూమర్స్.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్!
నికిషా పటేల్, ప్రభుదేవా మ్యారేజ్ రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ లా వ్యాపించాయి. కొన్ని రోజులుగా నికిషా , ప్రభుదేవాకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నాయి. నికిషా ఓ ఇంటర్వ్యూలో ప్రభుదేవా గురించి చెసిన వ్యాఖ్యలే దీనికి కారణం.
ఇటీవల నికిషా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభుదేవా కుటుంబంతో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని నికిషా పేర్కొంది. ప్రభుదేవా దర్శత్వంలో నటిస్తారా అనే ప్రశ్నకు స్పందిస్తూ నటించమే కాదు పెళ్లి కూడా చేసుకుంటానని వ్యాఖ్యానించింది. దీనితో నికిషా పటేల్, ప్రభుదేవా ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు.

నికిషా, ప్రభుదేవా వివాహం జరగబోతోందంటూ న్యూస్ వైరల్ అయింది. దీనిగురించి స్పందించిన నికిషా క్లారిటీ ఇచ్చింది. తన వ్యాఖ్యలని పూర్తిగా అపార్థం చేసుకున్నారని వాపోయింది. తన గురించి, ప్రభుదేవా గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తేల్చేసింది. నటన, కుటుంబంతో తాను బిజీగా ఉన్నానంటూ చెప్పుకొచ్చింది.దీనితో నికిషా ప్రభుదేవా గురించిచెసిన వ్యాఖ్యలు సరదాకు మాత్రమే అని తేలిపోయింది.


Click it and Unblock the Notifications











