»   » అయ్యప్ప శర్మ దర్శకత్వంలో ‘పులి’నికిషా పటేల్

అయ్యప్ప శర్మ దర్శకత్వంలో ‘పులి’నికిషా పటేల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవన్ 'పులి"చిత్రంతో పరిచయమైన నికిషా పటేల్ కి ఆ తర్వాత తెలుగులో ఒక్క ఆఫరూ రాలేదు.అయితే ఇప్పుడు ఆమె కన్నడంలో మాత్రం ఫుల్ బిజీగా ఉంది.అక్కడ తెలుగులో హిట్టయిన 'లక్ష్యం"(జగపతిబాబు, గోపిచంద్ కాంబినేషన్‌) చిత్రం రీమేక్ లో చేస్తోంది. కన్నడ నేటివిటీకి తగ్గట్టుగా కథలో పలు మార్పులు, చేర్పులు చేశారని సమాచారం. సుదీప్, అర్జున్, సాయికుమార్ ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలు పోషిస్తుండగా చిరంజీవి సర్జా, నికిషా పటేల్ జంటగా నటిస్తున్నారని వినికిడి. కాగా సుదీప్ సరసన ప్రియమణి కథానాయికగా నటిస్తున్నారట. ఇటీవల 'కెంపే గౌడ"లాంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన శంకర్ గౌడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయ్యప్పశర్మ దర్శకత్వంలో చిత్రం రూపొందుతోంది.

English summary
Nikisha Patel in Sudeep's next movie, which is said to be a remake of hit Telugu movie Lakshyam.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu