పవన్ కళ్యాణ్‌తో తప్ప ఎవరితో అలాంటివి చేయనంటోంది!
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన 'పులి' చిత్రం ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది భారత సంతతికి చెందిన బ్రిటిష్ భ్యూటీ నికిషా పటేల్. పవన్ కళ్యాణ్ సరసన అవకాశం దక్కడంతో స్టార్ హీరోయిన్ కావడం ఖాయమని కలలుకన్న ఆమెకు తొలిచిత్రంతోనే చేదు అనుభవం ఎదురైంది.
ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
పులి చిత్రం ప్లాపు కావడంతో నికిషా పటేల్‌కు అవకాశాలే కరువయ్యాయి. ఎదురు చూడగా..చూడగా ఆ తర్వాత రెండేళ్లకు కన్నడ చిత్రాల్లో అవకాశం దక్కించుకుంది. అయినా పెద్దగా పేరు మాత్రం రాలేదు. ఆ మధ్య తెలుగు చిత్రం కళ్యాణ్ రామ్ 'ఓం 3డి' చిత్రంలో అవకాశం దక్కినా మళ్లీ నిరాశే ఎదురైంది.

ప్రస్తుతం తమిళ, కన్న చిత్రాలపై దృష్టి సారించిన నికిషా పటేల్ తన గ్లామర్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే ఆమె అందం ఐటం సాంగులకు పనికొచ్చే విధంగా ఉండటంతో కొందరు ఆమెను సంప్రదించారు. అయితే ఆమె మాత్రం ససేమిరా అంటోంది.
ఇటీవల నాగచైతన్య- సుధీర్ వర్మ సినిమా కోసం నిఖిషా పటేల్ ని సంప్రదించారు. దీని గురించి ఆమె మాట్లాడుతూ ``నాకు చాలా ఆఫర్లు వస్తున్నాయి. కానీ నేనే వాటిని వద్దనుకుంటున్నాను. నాగచైతన్య సినిమాలో స్పెషల్ సాంగ్ చేయమని అడిగారు. కానీ అలాంటి స్పెషల్ సాంగ్ లు చేయాలని లేదు. ఒకవేళ చేసినా అది ఒన్ అండ్ ఒన్లీ పవన్ కల్యాణ్ సినిమాల్లోనే చేస్తాను. ఇంకెవరి సినిమాల్లోనూ చేయను`` అని నిక్కచ్చిగా చెప్పింది.


Click it and Unblock the Notifications











