ఈ బికినీ గోలేంటి పాపా? ( హాట్ ఫోటోలతో...)
హైదరాబాద్ : బికినీ వేయటం కొత్త విషయమూ కాదు. వింత విషయం అంతకన్నా కాదు. నేను తొలిసారి బికినీ వేస్తున్నా..చూడ్డానికి రండహో అని టాం టాం చేయటమే వింతగా అనిపిస్తుంది. 'ఓం' చిత్రంలో నిఖిషా పటేల్ తన కెరీర్లోనే తొలిసారిగా బికీనీ అందాలతో కనువిందు చేయబోతోంది. ఈ విషయాన్ని నికీషా తన ట్విట్టర్ ద్వారా స్వయంగా వెల్లడించింది. అంతేకాదు ప్రతీ ఇంటర్వూలో ఇదే విషయం ఆమె చెప్తోంది.
ఇది విన్న వారంతా బికీనీలో అమ్మడు ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి అంటున్నారు. పవన్ కళ్యాణ్ నటించిన 'పులి' చిత్రం ద్వారా తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం అయిన నికీషా పటేల్, ఆ సినిమా ప్లాపు కావడంతో ఇప్పటి వరకు మళ్లీ తెలుగు తెరపై కనిపించలేదు.
ఈ నెల 19న విడుదల కాబోతున్న కళ్యాణ్ రామ్ 'ఓం' 3డి చిత్రం ద్వారా మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 'ఓం' చిత్రంలో నికీషా అందాల ప్రదర్శన అందరికీ ఆకట్టుకోనుంది. ఈ చిత్రంలో ఆమె పాత్ర హైలెట్ కానుందని తెలుస్తోంది. ఈ సినిమాతో తన కెరీర్ మళ్లీ మొదలు కాబోతోందన్న ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
నిఖిషా పటేల్ గురించి స్లైడ్ షోలో...

గుజరాతీ డీసెంట్ ఫ్యామిలీకి చెందిన నిఖిషా పటేల్ ఇంగ్లాండ్ లోనే పెరిగింది. ఆమె మోడలింగ్ ని కాలేజి రోజుల్లోనే ప్రారంభించింది. 2006 లో ఆమె మిస్ వాల్స్ బ్యూటీ గా ఎంపికైంది. అప్పటి నుంచే ఆమెకు మోడలింగ్ లో ఆఫర్స్ రావటం మొదలయ్యాయి. అక్కడ నుంచే తన సంపాదన మొదలైందని నిఖిషా గర్వంగా చెప్తుంది.

సినిమాల్లోకి నిఖిషా పటేల్ తెలుగు సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ తో పులి చిత్రంలో చేసింది. ఎస్.జె.సూర్య దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. దాంతో నిఖిషా డీలా పడింది. ఆమె కెరీర్ అయిపోయింది అని అంతా అనుకున్నారు. ఈ స్టేజిలో ఆమె పవన్ క్యాంప్ వల్లే తన కెరీర్ నష్టపోయానన్నట్లు స్టేట్ మెంట్స్ సైతం గుప్పించింది.

పులి విడుదల కాగానే నిఖిష... దర్శకుడు కె.ఎస్ అదయమాన్ దర్శకత్వంలో ఓ తమిళ చిత్రం కమిటైంది. ఆ చిత్రం టైటిల్ Amali Thumali. మొదటి దానికి నంబా అనే టైటిల్ పెట్టారు. అయితే తర్వాత జరిగిన నాటకీయ పరిణామాలతో ఆ చిత్రం నుంచి ఆమె వైతొలిగింది. ఆమె కు తమిళంలోనూ అనుకున్నంత క్రేజ్ రాలేదు.

తెలుగు,తమిళ భాషల్లో వర్కవుట్ కాని ఆమె పట్టువదలకుండా కన్నడ భాషలోకి ప్రవేసించింది. అక్కడ క్రేజీ స్టార్ రవిచంద్రన్ సరసన 2012 లో వచ్చిన నరసింహ చిత్రంలో నటించింది. ఆ చిత్రంపై చాలా ఆశలు పెట్టుంకుంది. మార్చి 13 న విడుదలైన ఆ చిత్రం డిజాస్టర్ అవ్వటంతో ఆమె కు అక్కడా ఆదరణ కరువైంది.

నిఖిషా పటేల్ తర్వాత మరిన్ని కన్నడ ప్రాజెక్టులు సంపాదించగలిగింది. లక్ష్యం తెలుగు చిత్రం రీమేక్ తో ఆమె మళ్లీ అక్కడ రీ ఎంట్రీకై పాకులాడింది. ఆ సినిమా మంచి బిజినెస్సే చేసింది. కానీ అక్కడ ఆమె తనదైన మార్క్ వేయలేకపోయింది. దాంతో ఆమెకు అక్కడ మళ్లీ చుక్కెదురైంది.

సరే అటు ఇటు తిరిగి మళ్లీ తెలుగు వైపు నిఖిష ప్రయాణం పెట్టుకుంది. ఈ సారి తాను చేస్తున్న చిత్రం 3డి కావటంతో ఖచ్చితమైన హిట్ వస్తుందని భావిస్తోంది. ఈ శుక్రవారం విడుదల అవుతున్న ఈ చిత్రం ఆమె భవితను నిర్ణయిస్తుందని భావిస్తోంది. తొలి త్రీడి యాక్షన్ చిత్రంగా పేరు తెచ్చుకున్న ఈ చిత్రంలో ఆమె తనేంటో ప్రూవ్ చేసుకుంటానంటోంది.

ఓం చిత్రంలో కృతి కర్బందా, నికీషా పటేల్ హీరోయిన్స్. సునీల్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బేనర్‌పై కళ్యాణ్ రామే నిర్మిస్తున్నారు. 3డిలో రూపొందుతున్న ‘ఓం' ఈ చిత్రానికి హాలీవుడ్ చిత్రాలైన స్టెప్ అప్ 3డి, ఫైనల్ డెస్టినేషన్, అవతార్, స్పైడర్ మ్యాన్ 4 లాంటి చిత్రాలకు పని చేసిన టెక్నీషన్స్ పని చేస్తున్నారు. ఆచు, సాయి కార్తీ సంగీతం అందించారు.

కళ్యాణ్ రామ్ తాజా చిత్రం 'ఓం 3D'లో హీరోయిన్ గా చేసిన నిఖిషా పటేల్ తాను అప్ సెట్ అయ్యానంటోంది. ఎందుకంటే...తన పుట్టిన రోజు..ఈ చిత్రం ప్రమోట్ చేస్తూ బిజీగా ఉండాల్సివస్తోంది అంటోంది. పవన్ సరసన కొమురం పులి చిత్రంలో చేసిన నిఖిషాకు ఆ సినిమా బ్రేక్ ఇవ్వలేకపోయింది. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ కళ్యాణ్ రామ్ చిత్రంతో వస్తోంది.

నిఖిషా మాట్లాడుతూ... " 'ఓం 3D'చిత్రం మొదట అనుకున్న తేదీ కాకుండా 19 జూలైకు ఫోస్ట్ ఫోన్ అయ్యింది. అంటే నా పుట్టిన రోజుకు ఒక రోజు ముందన్నమాట. దానిఅర్దం..ఈ పుట్టిన రోజుని చిత్రం ప్రమేషన్ లో గడపాలి అన్నమాట..నేను చాలా అప్ సెట్ అయ్యాను," అంది.

ఆమె వరసగా సినిమాలు ఒప్పుకుంది. ఆమె మళయాళ,తమిళ చిత్రాలు కమిటైంది. అలాగే తెలుగులో ఎమ్.ఎస్ రాజు దర్సకత్వంలో రూపొందుతున్న రమ్ చిత్రంలో కీ రోల్ చేస్తోంది. రమ్ చిత్రంలో ఆమె తో పాటు త్రిష,ఛార్మి కూడా కనిపించనున్నారు.

ఓం చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతినిచ్చేందుకు ఎప్పటికప్పుడు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొంటున్నారు ఈ దర్శకనిర్మాతలు. ఈ చిత్రంలో కార్తీక్, సురేష్, రావు రమేష్, రఘు, సితార తదితరులు నటించారు. కూర్పు: గౌతమ్‌రాజు, కళ: కిరణ్, స్టీరియోగ్రాఫర్స్: డేవిడ్ మైక్‌టేలర్, మార్కస్, మజ జ్డోవిన్‌స్కీ; ఫైట్స్: విజయ్, రవివర్మ; సంగీతం: అచ్చు, సాయికార్తీక్.


Click it and Unblock the Notifications











