హ్యాపీ బర్త్‌డే పావలా కల్యాణ్ అంటూ హీరోయిన్ ట్వీట్.. తప్పును గుర్తించి ఏం చేసిందంటే..
పవన్ కల్యాణ్.. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు చాలా ప్రాంతాల్లో ఈ పేరంటే పిచ్చి. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ రంగ ప్రవేశం చేసినప్పటికీ, తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. టాలీవుడ్‌లోని మిగిలిన హీరోలతో పోలిస్తే ఈయన స్టైల్ ప్రత్యేకంగా ఉంటుంది. అందుకే తెలుగు సినీ ఇండస్ట్రీలో పవన్ కల్యాణ్‌కు ఉన్న అభిమానులు మరే హీరోకూ లేరని అంటుంటారు. నిజమే పవన్ కల్యాణ్ అంటే ఏదో తెలియని శక్తి అభిమానుల్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఆయన పుట్టినరోజున ఓ హీరోయిన్ చేసిన ట్వీట్ చర్చనీయాంశం అవుతోంది.

అర్ధరాత్రి నుంచే మొదలయ్యాయి
సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ 48వ పడిలోకి అడుగు పెట్టారు. దీంతో తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో ఉన్న పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన పుట్టినరోజు సంబరాలు చేస్తున్నారు. వాస్తవానికి వారం రోజుల ముందు నుంచే దీనికి సంబంధించిన పనులన్నీ మొదలయ్యాయి. ఇక, ఆదివారం అర్ధరాత్రి నుంచే ఫ్యాన్స్ కేక్స్ కట్ చేయడం.. సోషల్ మీడియా ద్వారా విషెస్ చెప్పడం.. పవన్ డీపీలు, ఫ్లెక్సీలు ఇలా రచ్చ రచ్చ చేసేశారు.

పవన్ నామస్మరణతో దద్దరిల్లిపోయింది
సోమవారం పవన్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా మొత్తం ఆయన పేరుతో మారుమ్రోగిపోయింది. ఫ్యాన్స్‌తో పాటు ఎంతో మంది సినీ, రాజకీయ ప్రముఖులు పవర్ స్టార్‌కు విషెస్ చెప్పారు. ముఖ్యంగా పవన్‌తో అనుబంధం ఉన్న చాలా మంది ప్రముఖులు తమ ప్రేమను చాటుకున్నారు. దీంతో పవన్ నామస్మరణతో సోషల్ మీడియా దద్దరిల్లిపోయింది

ట్రెండ్ అయిన పవన్
ఒకవైపు ఫ్యాన్స్, మరోవైపు సెలెబ్రిటీలు సోషల్ మీడియాలో పవన్ కల్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతుండడంతో ఆయన మరోసారి ట్రెండ్ అయ్యారు. ఆయన పేరుతో రూపొందించిన #HappyBirthdayPawanaKalyan ట్యాగ్ ఇండియాలో మొదటి స్థానంలో ట్రెండ్ అయింది. ఆ తర్వాత #happybirthdaypowerstar మూడో స్థానంలో, #HappyBirthdayJanasenani నాలుగో స్థానంలో కొనసాగాయి.
పావలా కల్యాణ్ అన్న హీరోయిన్
‘కొమరం పులి' అనే సినిమాలో పవన్ సరసన నటించిన నికిషా పటేల్ పొరపాటు చేసి విమర్శల పాలవుతోంది. పవర్ స్టార్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆమె తన ట్విట్టర్ ఖాతాలో శుభాకాంక్షలు తెలియజేసింది. అదే సమయంలో ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్న పలు హ్యాష్ ట్యాగ్స్ జోడించింది. అందులో #HappyBirthdayPawalaKalyan, #HappyBirthdayPawanaKalyanfromSSMBfans, #HappyBirthdayPSPK, #pawankalyan అనే ట్యాగ్‌లతో పాటు #HappyBirthdayPawalaKalyan అని కూడా ఉంది.
తర్వాత ఏం చేసిందంటే...
పావలా కల్యాణ్ అని ఉన్న ట్యాగ్‌ను యాడ్ చేయడంతో పవన్ ఫ్యాన్స్ ఆమెపై విరుచుకు పడ్డారు. దీంతో పొరపాటును గ్రహించిన నికీషా.. వెంటనే ఆ ట్వీట్‌ను డిలీట్ చేసింది. అంతేకాదు, ఆ తర్వాత ‘ఈసారి సరిగానే ట్యాగ్ చేశా అనుకుంటున్నా.. సోషల్ మీడియా చాలా క్లిష్టంగా మారింది. దీన్ని ఎలా కొనసాగిస్తున్నారో నాకు తెలియదు' అని ట్వీట్ చేసింది. అలాగే, ‘ఎవరైనా హర్ట్ అయితే సారీ.. తప్పును సరిదిద్దుకున్నా. హ్యాపీ గణేషా.. #PSPK #pawankalyan' అంటూ మరో ట్వీట్ చేసింది. దీంతో దీనికి పుల్‌స్టాప్ వేసింది.


Click it and Unblock the Notifications











