గౌతం కార్తీక్‌తో పవన్ ప్లాపు హీరోయిన్
గౌతం కార్తీక్ తొలి చిత్రం 'కడలి' ప్లాపయినప్పటికీ ఆయన పెర్ఫార్మెన్స్‌కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం గౌతం కార్తీక్ రెండు తమిళ చిత్రాల్లో నటిస్తున్నాడు. అందులో ఒకటి తెలుగు సూపర్ హిట్ మూవీ అలా మొదలైందికి రీమేక్ గా రూపొందుతోంది.
ఇక నికీషా పటేల్ విషయానికొస్తే....2010లో'పులి' చిత్రం ద్వార హీరోయిన్ గా పరిచయం అయిన నికీషా ఆ చిత్రం ప్లాపు కావడంతో ఆ తర్వాత రెండేళ్ల పాటు ఒక్క ఛాన్స్ దక్కలేదు. 2012లో మూడు కన్నడ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం తెలుగులో కళ్యాణ్ ఓం చిత్రంతో పాటు, ఎంఎస్ రాజు దర్శకత్వంలో రూపొందుతున్న 'రమ్' చిత్రంలో నటిస్తోంది.
మరో వైపు తమిళ పరిశ్రమలోనూ పలు అవకాశాలు దక్కించుకుంటూ హీరోయిన్‌గా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం నికీషా నటిస్తున్న చిత్రాలు బాక్సాఫీసు వద్ద సాధించే ఫలితాలను బట్టే ఆమె భవిష్యత్ ఆధార పడి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి ఏం జరుగబోతోందో చూద్దాం!


Click it and Unblock the Notifications












