ఆ హీరో కళావర్ కింగ్
హ్యాపీడేస్ చిత్రంతో పరిచయమై యువత చిత్రంతో సోలో హీరోగా మారి హిట్టు కొట్టిన నికిల్ తాజాగా కళావర్ కింగ్ అనే టైటిల్ తో ఓ చిత్రం చేయటానికి కమిట్ అయ్యాడు. నూతన దర్శకుడు పరిచయం కానున్న ఈ చిత్రాన్ని డి.యస్.రావ్ నిర్మిస్తున్నారు. అలాగే ఈ చిత్రం పూర్తి స్ధాయి ఎంటర్టైనర్ అని చెప్తున్నారు. డి.యస్.రావ్ గతంలో నితిన్ ద్రోణ చిత్రాన్ని నిర్మించారు. ప్రియమణి చేత బికినీ వేయించిన ఘనత దక్కించుకున్న ఈ నిర్మాణ సంస్ధ ఈ కళావర్ కింగ్ లో ఏం జిమ్మిక్కులు చేయనుందో అని వినపడుతోంది. ద్రోణకు ముందు డి.యస్.రావ్ నిర్మాతగా మహారాజశ్రీ(రాశి భర్త దర్శకుడుగా), ఒక పెళ్ళాం ముద్దు రెండో పెళ్ళాం వద్దు, ఛార్మినార్ వంటి చిత్రాలు నిర్మించారు.
nikhil yuvatha kalavar king happy days sekhar kammula drona nitin priyamani నితిన్ ద్రోణ డియస్రావ్ కళావర్ కింగ్ నికిల్ హ్యాపీడేస్ యువత ఛార్మినార్


Click it and Unblock the Notifications