శభాష్ ...నిఖిల్ ని మెచ్చుకోవాల్సిందే
హైదరాబాద్ : సాధారణంగా హీరోలు కొత్త టాలెంట్ ని పరిచయం చేయటానికి భయపడుతూంటారు. వేరే హీరోతో హిట్ కొట్టిన డైరక్టర్ తో తాము చేయటానికి ఎగబడుతూంటారు. దాంతో ఎంత టాలెంట్ ఉన్నా పిల్లి మెళ్లో గంట కట్టేదెవరు అన్నట్లుగా ఏ హీరో డేట్స్ ఇస్తాడా అని కొత్త దర్శకులు కథ పట్టుకుని హీరోల చుట్టూ తిరుగుతూంటారు. అయితే ఈ విషయంలో నిఖిల్ ముందు ఉన్నాడు. వరసగా కొత్త దర్శకులను పరిచయం చేస్తూ సినిమాలు చేస్తున్నాడు.
'స్వామి రా రా'తో విజయం అందుకొన్న యువ హీరో నిఖిల్. తాజాగా చేసిన 'కార్తికేయ' విడుదలకు సిద్ధమవుతోంది. ఈ రెండు చిత్రాలకు కొత్త దర్శకులే. ఈ లోగా మరో సినిమాను పట్టాలెక్కించాడు. ఆయన హీరోగా కొత్త చిత్రం సోమవారం ప్రారంభమైంది. అదే 'సూర్య వర్సెస్ సూర్య'. కార్తీక్ ఘట్టమనేని దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

'ప్రేమ ఇష్క్ కాదల్','కార్తికేయ' చిత్రాలకు ఛాయాగ్రాహకుడిగా పని చేశారీయన. మాల్కపురం శివకుమార్ నిర్మాత. ''వినోదాత్మకంగా సాగే ప్రేమకథ ఇది. హీరోయిన్ ను ఎంపిక చేయాల్సి ఉంది''అని నిర్మాత తెలిపారు.
దర్శకుడు మాట్లాడుతూ... స్వామిరారా, కార్త్తికేయ తరహాలోనే నిఖిల్‌ను విభిన్నంగా చూపించబోతున్న మరో కమర్షియల్ ఎంటర్‌టైనర్ ఇది. ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం కొత్తగా వుంటుంది అని తెలిపారు. తనికెళ్లభరణి, సత్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్: గౌతం, సంగీతం: సత్య, పాటలు: రామజోగయ్య శాస్త్రి, ఆర్ట్: నాగేంద్రప్రసాద్.


Click it and Unblock the Notifications











