కార్తీకేయ 2 సీక్వెల్‌తో నిఖిల్.. స్వాతి తర్వాత హీరోయిన్ ఎవరంటే!
యువ హీరో నిఖిల్, దర్శకుడు చందూ మొండేటి కాంబినేషన్‌లో కార్తీకేయ 2 చిత్రం ప్రారంభం కాబోతున్నది. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబోట్ల నిర్మించనున్నారు. ఈ చిత్రాన్ని జూన్ 1వ తేదీన నిఖిల్ బర్త్ డేను పురస్కరించుకొని అధికారిక ప్రకటన చేయనున్నారు. 2014లో నిఖిల్, స్వాతి జంటగా చందు దర్శకత్వంలో వచ్చిన కార్తీకేయ చిత్రం భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
కార్తీకేయ 2 సినిమా ప్రారంభోత్సవం సందర్బంగా దర్శకుడు చందు మొండేటి మాట్లాడుతూ.. హీరో నిఖిల్‌తో నా తొలి చిత్రం కార్తీకేయ భారీ విజయాన్ని అందుకొన్నది. దాంతో కార్తీకేయ 2 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా కూడా ప్రేక్షకుల అంచనాలకు మించి ఉంటుంది. కార్తీకేయ సినిమాకు సీక్వెల్‌గా వచ్చే కార్తీకేయ 2 సినిమా స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్ ఉంటుంది. కార్తీకేయ 2 ఆ సినిమాకు పర్‌ఫెక్ట్ సీక్వెల్ అని భావిస్తున్నాం అని అన్నారు.

కార్తీకేయ 2 మూవీ త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్నది. నటీనటులు, సాంకేతిక నిపుణులు వివరాలను త్వరలోనే యూనిట్ వెల్లడించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా, వివేక్ కూచిబొట్ల ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తారు. కథ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్: చందూ మొండేటి.
ఇక నిఖిల్ కెరీర్ విషయానికి వస్తే, గతంలో వచ్చిన కిరిక్ పార్టీ మిశ్రమ స్పందనను సొంతం చేసుకొన్నది. తాజాగా ఆయన నటించిన అర్జున్ సురవరం చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.


Click it and Unblock the Notifications











