కలర్స్ స్వాతి కొత్త చిత్రం ‘స్వామి రా..రా..’

By Srikanya

నిఖిల్, కలర్స్ స్వాతి జంటగా 'స్వామి రా..రా..' పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతోంది. సుధీర్‌వర్మ దర్శకత్వంలో చక్రి చిగురుపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నేడు ఈ సినిమా హైదరాబాద్‌లో మొదలవుతుంది. వరస ప్లాపుల్లో ఉన్న నిఖిల్,కలర్స్ స్వాతి ఇద్దరూ ఈ చిత్రంపై ఆశలు పెట్టుకున్నారు.

ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ...''మా తొలి ప్రయత్నంగా నిఖిల్‌తో 'వీడు తేడా' నిర్మించాం. ఆ సినిమా మంచి హిట్ అయ్యింది. ఈ రెండో సినిమాని కూడా ఎక్కడా రాజీ పడకుండా లావిష్‌గా తెరకెక్కించనున్నాం. కేరళ, కర్నాటక, తమిళనాడుల్లోని పలు అందమైన ప్రదేశాల్లో చిత్రీకరణ జరుపుతాం'' అన్నారు.. రవిబాబు, జీవా, పూజ, ప్రవీణ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రిచర్డ్ ప్రసాద్ డిఎఫ్‌టి, సంగీతం: సన్ని, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, పాటలు: కృష్ణచైతన్య, సహ నిర్మాత: సందీప్ కొరటాల.

ఇక ప్రస్తుతం కలర్స్ స్వాతికి పెద్దగా సినిమాలు తమిళంలోనూ లేవు. తెలుగులో కందిరీగ తర్వాత ఆఫర్లేమీ రాలేదు. ఆ మధ్య ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరక్షన్ లో ఓ సినిమా అనుకున్నారు కానీ అది ముందుకు వెళ్లలేదు. అప్పలరాజు డిజాస్టర్ కావటంతో ఆమెను హీరోయిన్ గా తీసుకునే వారు సైతం కరువయ్యారు. అయితే ఈ విషయమై కలర్స్ స్వాతి సొంత విశ్లేషణ చేసుకుటోంది.

ఆమె మాట్లాడుతూ..."నా బలహీనత గురించి చెప్పాలంటే... నాకు కొంచెం నోటి దురుసు ఎక్కువ. దాన్ని మాత్రం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఈ కారణంగా చాలామందిని 'హర్ట్' చేశాను" కూడా అంటోంది కలర్స్ స్వాతి. చెన్నయ్‌లో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన ఆమె మీడియాతో మాట్లాడుతూ "ఇలా స్పందించింది. అలాగే ..నేనేమీ హఠాత్తుగా హీరోయిన్ కాలేదు. యాంకర్‌గా ప్రయాణం మొదలుపెట్టి హీరోయిన్ అయ్యాను. ఈ ప్రయాణంలో నాపై ఎన్నో రూమర్లు, మరెన్నో విమర్శలు వచ్చాయి. గాసిప్స్ ను అస్సలు పట్టించుకోను. అర్హత కలిగిన విమర్శలను మాత్రం గౌరవిస్తాను" అంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X