నిఖిల్ 'డిస్కో' సెన్సార్ కట్స్
నిఖిల్, శారాశర్మ, అశిష్ విద్యార్థి, అలీ, రఘుబాబు ముఖ్యపాత్రలు పోషించిన 'డిస్కో' చిత్రం ఆ మధ్యన విడదలై ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రానికి దర్శకుడు హరి.కె. చుండూరి. స్టైల్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాన కె. అభినవ్‌రెడ్డి నిర్మించారు.
1. పదకొండు పన్నెండు రీళ్లలో తెల్లని బికినీతో జీరో సైజ్ తనువుతో ఉన్న యువతికి సంబంధించిన దృశ్యాలు తొలగించారు.
2. 'అమ్మాయి అబ్బాయిల సపోర్ట్ లేకుండా ఏమీ చెయ్యలేరు, డే అన్నా నైట్ అన్నా' డైలాగ్ తొలగించారు.
3. 'ఆపరేషన్ చేసి మేటర్ తీయించాలి'కి కత్తెర పడింది.
4. 'ఒక్కసారి టేస్ట్ చేద్దాం దగ్గరకు రావే' అనే వాక్యం కత్తెర పాలైంది.
5. లత్కోరుగాడు, చిల్లు పడిపోతాడు, మూసుకొని, వూడిపోతాది, తొక్కలో, దొబ్బేద్దామని, కప్‌లింగ్ మే దడ్ దడ్, చాలా గ్యాప్ వచ్చింది చూసి, పగిలిపోతుంది, నీ యబ్బా, గొట్టం పగిలిపోతుంది - పదాలు సినిమాలో ఎక్కడవున్నా తొలగింపుకు గురైయ్యాయి.
6. 'ఏనుగు మీద ఎలకపిల్ల సవారి చేసిందంటే ఎవరు నమ్ముతారు' డైలాగ్‌ని తొలగించారు.
7. సినిమా ప్రారంభంలోను, మధ్యలోనూ ధూమపానం ఆరోగ్యానికి హానికరం - అనే చట్టబద్ధమైన హెచ్చరికను 15 సెకన్లపాటు చూపిస్తూ వాయిస్ ఓవర్ కూడా వుండాలన్నారు.
4217.77 మీటర్ల నిడివిగల ఈ చిత్రం 20-4-12న విడుదలైంది.'డిస్కో'ని చూసిన ఇసి 'పెద్దలకు మాత్రమే' అంటూ 'ఏ' సర్టిఫికెట్‌ని 7 కట్స్‌తో 19-4-12న జారీ చేసింది.
నిఖిల్, సారాశర్మ, ఎమ్మెస్.నారాయణ, అలీ, విజయ్, ఖయ్యూం, వంశీకృష్ణ, అశిష్‌విద్యార్థి, రఘుబాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు: సతీష్ మల్లంపాటి, ఛాయాగ్రహణం: జోషి మల్హర్‌భట్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: యామినీ మాథ్యూస్, నిర్మాత: కె.అభినవ్‌రెడ్డి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: హరి.కె.చందూరి.


Click it and Unblock the Notifications











