మందుకొట్టి దొరికిపోవడంపై నిఖిల్ కహానీలు!
హీరో నిఖిల్ ఇటీవల మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన విషయం తెలిసిందే. దొరికింది నేను కాదు, నా కారును తీసుకెళ్లిన నా స్నేహితులు పోలీసులకు దొరికి ఉంటారు అంటూ బుకాయించిన ఈ హీరో.... వ్యవహారం కోర్టు దాక వెళ్లడంతో తప్పు చేశాను, శిక్ష అనుభవిస్తాను అంటూ చివరకు వివరణ ఇచ్చాడుకూడా.
అయితే...ఈ ఘటనపై నిఖిల్ కహానీలు, సొల్లు కొబుర్లు చెప్పడం మొదలు పెట్టాడట తన సన్నిహితుల వద్ద. ''సరదాగా, సంతోషంగా ఉన్నప్పుడు చీర్స్ అంటూ బాటిల్స్ ఓపెన్ చేసి సంతోషాన్ని వ్యక్తం చేసుకుంటాం. అలాగే నేనూ చేశాను. వీడుతేడా చిత్రం విడుదల నేపథ్యంలో జూబ్లీహిల్స్‌లో మందుకొట్టి కారు డ్రైవ్ చేస్తుండగా పోలీసులు పట్టుకుని, కోర్టు వరకు తీసుకువచ్చారు. దీనిపై నేనుగానీ, నా నిర్మాతగానీ పెద్దగా బాధ పడటం లేదు. సినిమాకూ, నీకూ పబ్లిసిటీ వచ్చిందని సంబరపడిపోయారు. క్రికెట్ క్రీడాకారులు ఆట ఆడి గెలిచాక ఛీర్స్ అంటూ.. పబ్లిక్‌గా బాటిల్ ఓపెన్ చేసేది మందేకదా... అలాగే మేము కూడా అంటున్నాడట.
ఇంతటితో తన వాగుడు ఆపకుండా...ఎంతోమంది మందుగొట్టి కార్లలో నా కళ్ళముందూ పోతున్నారు. కానీ పోలీసుల కళ్లలో నేనే పడ్డాను. ఆరోజు అన్ని పేపర్లో ఫ్రంట్ పేజీల్లో వేశారు. ఇది ఒకరకంగా నాకు పబ్లిసిటీనే అంటూ సమర్థించుకుంటున్నాడట.


Click it and Unblock the Notifications











