క్లారిటీ ఇచ్చేసిన నిఖిల్.. ప్రభాస్ వచ్చెళ్లిన తర్వాతనే పలకరిస్తాడట

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ - లావణ్య త్రిపాఠి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం 'అర్జున్ సురవరం'. నూతన దర్శకుడు టీఎన్ సంతోష్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా విడుదల వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. మొదట ఈ సినిమాకు 'ముద్ర' అనే టైటిల్ అనుకున్నారు. అయితే, అదే పేరుతో కొద్దిరోజుల క్రితం జగపతిబాబు హీరోగా ఓ సినిమా విడుదలైంది. దీంతో 'అర్జున్ సురవరం' అనే పేరు పెట్టారు. అయితే, ఏదో ఒక కారణంతో ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. కొద్దిరోజుల క్రితం ఈ సినిమా సెప్టెంబర్ మొదటి వారంలో విడుదల అవుతుందని వార్తలు వచ్చాయి.

తాజాగా ఈ సినిమా విడుదలకు సంబంధించిన అప్‌డేట్‌ను చిత్ర హీరో నిఖిల్ వెల్లడించాడు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే నిఖిల్‌ను ఓ అభిమాని సినిమా ఎప్పుడు విడుదలవుతుందని ప్రశ్నించాడు. దీనికి నిఖిల్.. ప్రభాస్ 'సాహో' వచ్చిన కొద్దిరోజులకు ప్రేక్షకుల ముందుకు వస్తుందని చెప్పాడు. దీంతో 'అర్జున్ సురవరం' విడుదలపై ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఆశలన్నీ ఈ సినిమా మీదే పెట్టుకుంది. ఆమెకి ఈ సినిమా హిట్ కీలకం.

Nikhil gave clarity about his movie

అన్నట్లు 'సాహో' ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. నాలుగు భాషల్లో తెరకెక్కిన ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ఇందులో ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ నటించింది. ఈ చిత్రాన్ని 'రన్ రాజా రన్' ఫేమ్ సుజిత్ తెరకెక్కించాడు. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్‌, హై టెక్నికల్ వాల్యూస్‌తో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాను నిర్మించింది.

మరోవైపు, ఈ సినిమా విడుదల కాకముందే నిఖిల్ మరో ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు పావులు కదుపుతున్నాడు. అదే.. తనకు 'కార్తికేయ' వంటి సూపర్ హిట్ ఇచ్చిన చందూ మొండేటితో మరోసారి జతకట్టబోతున్నాడు నిఖిల్. ఆ సినిమాకు సీక్వెల్‌గా 'కార్తికేయ 2' వస్తోంది. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయిపోయిందని తెలుస్తోంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటు కామెడీకి పెద్ద పీట వేస్తూ ఈ స్క్రిప్టును తయారు చేశాడట చందు. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ అధికారికంగా ప్రారంభం కానుందని ప్రచారం జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X