నిఖిల్ కూడా పూర్తి చేశాడు.. ఆ హీరోయిన్లకు హీరో సవాల్
మూడో దశ గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను ప్రభాస్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్‌లో గ్రీన్ ఇండియా చాలెంజ్‌కు మంచి స్పందన వస్తూ ఉంటుంది. హీరో హీరోయిన్లు దర్శక నిర్మాతలు అందరూ కూడా మొక్కలు నాటి గ్రీన్ ఇండియాగా మార్చేందుకు తమ వంతు సాయం చేస్తుంటారు. మళ్లీ ఈ మధ్య రామ్ చరణ్ గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను రామ్ చరణ్ ప్రారంభించాడు. అప్పుడెప్పులో ప్రభాస్ విసిరిన చాలెంజ్‌ను స్వీకరించి.. మొక్కలు నాటి.. అలా ముందుకు కొనసాగించాడు.
ఇప్పుడు యంగ్ హీరో కార్తికేయ వంతు వచ్చింది. నటుడు రాజా రవీంద్ర ఇచ్చిన చాలెంజ్‌ను స్వీకరిస్తూ.. మొక్కలు నాటాడు. తాను నాటడమే కాకుండా తన 18 పేజీలు చిత్రయూనిట్‌కు చాలెంజ్ విసిరాడు. అంతే కాకుండా తన హీరోయిన్లు అనుపమా పరమేశ్వరణ్, అవికా గోర్‌లకు మొక్కలు నాటాలని సవాల్ విసిరాడు. మొక్కలు నాటి గ్రీన్ ఇండియా కార్యక్రమంలో పాలు పంచుకున్నందు థ్యాంక్స్ అంటూ ఎంపీ సంతోష్ నిఖిల్‌ను ప్రశంసించాడు.

మరో వైపు ఐశ్వర్యా రాజేష్ కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించింది. ఎంపీ సంతోష్ పిలుపు మేరకు ఈ మొక్కలు నాటుతున్నానని చెప్పింది. నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరూ కూడా ఈ చాలెంజ్‌ను స్వీకరించండి.. నా ఫ్యాన్స్ అందరూ కూడా నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో సమానమేనని, మీరు మొక్కలు నాటి నాకు షేర్ చేయండి.. నేను వాటిని పోస్ట్ చేస్తానని అభిమానుల్లో ఐశ్వర్యా రాజేష్ ఉత్సాహాన్ని నింపింది.


Click it and Unblock the Notifications











