twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కార్తికేయ 2 షూటింగ్‌లో ప్రమాదం.. గాయాలపాలైన నిఖిల్

    |

    సినిమా షూటింగ్‌లో హీరోలకు గాయాలు అవుతుంటాయి. అయితే ప్రమాదాలు జరగకుండా ఎన్నో ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నా కూడా అప్పుడప్పుడు కొన్ని చేదు ఘటనలు జరుగుతూనే ఉంటాయి. అలా ఎంతో మంది హీరోలకు, నటులకు సినిమా చిత్రీకరణ చేస్తుండగా.. షూటింగ్‌లో గాయాలవుతుంటాయి. ఆ మధ్య అయితే ఇండస్ట్రీలో వరుసగా కుర్ర హీరోలందరికీ గాయాలయ్యాయి.

    వరుసగా అలా..

    వరుసగా అలా..

    సందీప్ కిషన్, శర్వానంద్, సుధీర్ బాబు ఇలా కుర్ర హీరోలందరికీ తమ తమ సినిమా షూటింగ్‌లలో గాయాలయ్యాయి. ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్‌లో అయితే ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు లెక్కలేనన్ని సార్లు గాయాలయ్యాయి. తాజాగా హీరో నిఖిల్‌ ఓ మూవీ షూటింగ్‌లో గాయపడ్డాడనే వార్త వైరల్ అవుతోంది.

    పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా..

    పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా..

    అర్జున్ సురవరం సినిమాతో మళ్లీ ఫాంలోకి వచ్చాడు నిఖిల్. అంతకు ముందు కిరాక్ పార్టీతో దారుణమైన ఫలితాన్ని చవి చూశాడు. అయితే అర్జున్ సురవరంతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కిన హీరో.. మంచి కథలను ఎంచుకుంటూ దూసుకుపోతోన్నాడు. ఇప్పుడు నిఖిల్ చేతిలో రెండు ప్రాజెక్ట్‌లు సెట్స్ మీదున్నాయి.

    రెండు చిత్రాలు సెట్స్‌పై..

    రెండు చిత్రాలు సెట్స్‌పై..

    ప్రస్తుతం నిఖిల్ కార్తికేయ 2, 18 పేజీలు అనే రెండు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఇందులో కార్తికేయ సీక్వెల్‌గా రాబోతోన్న పార్ట్ 2 సినిమాపై అందరికీ అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. దర్శకుడు చందూ మొండేటి తనని తాను నిరూపించుకునే కసి మీదున్నాడు.

    షూటింగ్‌లో బిజీగా..

    షూటింగ్‌లో బిజీగా..

    కార్తికేయ 2 దేవాలయాలు, ద్వారక ప్రాంతం నేపథ్యంలో ఉండబోతోంది. ఈ మేరకు ఆ మధ్య ఓ వీడియోను కూడా వదిలారు. అయితే తాజాగా ఈ మూవీ నుంచి ఓ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రంలో బాలీవుడ్ ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ నటించబోతోన్నట్టు, ధన్వంతరి పాత్రను పోషించనున్నాడని ప్రకటించారు.

    హీరోకు ప్రమాదం..

    హీరోకు ప్రమాదం..

    అయితే అంతా సవ్యంగానే జరుగుతోందని అనుకునే సమయంలో.. ఇలా షూటింగ్‌లో హీరోకు గాయాలవ్వడం అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. గుజరాత్‌లో షూటింగ్ జరుగుతుండగా.. ఓ యాక్షన్ సీక్వెన్స్‌లో నిఖిల్ కాలికి గాయమైంది. దీంతో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోనున్నట్టు తెలుస్తోంది. యాక్షన్ సీక్వెన్స్ షెడ్యూల్‌ను వాయిదా వేసినట్టు తెలుస్తోంది.

    English summary
    Nikhil Injured In Karthikeya 2 movie shoot..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X