twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏసీలో హ్యాపీగా జీవితం.. రాజకీయాల్లోకి వచ్చి తిట్లు తినడం ఎందుకు.. నిఖిల్!

    |

    యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న తాజా చిత్రం అర్జున్ సురవరం. ఈ చిత్రంలో నిఖిల్ జర్నలిస్ట్ పాత్రలో నటిస్తున్నాడు. దర్శకుడు టీఎన్ సంతోష్ ఉత్కంఠ భరిత అంశాలతో రూపొందించారు. ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. అర్జున్ సురవరం చిత్ర విడుదల ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. అర్జున్ సురవరం చిత్రాన్ని మే 1న విడుదల చేయాల్సి ఉండగా అవెంజర్స్ ప్రభావం ఉంటుందని వాయిదా వేశారు మే 17న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. కాగా నిఖిల్ అర్జున్ సురవరం కోసం ప్రచార కార్యక్రమాలు ప్రారంభించాడు.

    ముసుగేసుకుని ఏడ్చేవాడిని

    ముసుగేసుకుని ఏడ్చేవాడిని

    నిఖిల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కెరీర్ ఆరంభంలో తనకు జయాపజయాలని ఎలా తీసుకోవాలో అర్థం అయ్యేది కాదు. ఒక సినిమా ప్లాప్ అయితే ముసుగేసుకుని పడుకునే వాడిని.. మా అమ్మని పట్టుకుని గట్టిగా ఏడ్చేసేవాడిని అని నిఖిల్ సరదాగా తెలిపాడు. కానీ స్వామిరారా చిత్రం తర్వాత క్రమంగా పరిణితి పెరిగిందని నిఖిల్ తెలిపాడు. పరాజయాలు కూడా జీవితంలో భాగం అని అర్థం అయింది. టీం ఇండియా ప్రతి మ్యాచ్ గెలుస్తుంటే కిక్ ఉండదు. అప్పుడప్పుడూ ఓడిపోతుంటేనే గెలుపు విలువ తెలుస్తుంది అని నిఖిల్ తెలిపాడు.

    విజయ్ దేవరకొండ కాకుంటే

    విజయ్ దేవరకొండ కాకుంటే

    యువ హీరోలతో కాంపిటీషన్ గురించి నిఖిల్ మాట్లాడాడు. తనకు ఎవరితోనూ పోటీ లేదని తెలిపాడు. అర్జున్ రెడ్డి చిత్రం వచ్చింది.. ఆ చిత్రంలో విజయ్ దేవరకొండ కాకుండా ఇంకెవరు నటించినా అంతలా ఆడేది కాదేమో. అలాగే నేను నటించిన కార్తికేయ, స్వామిరారా చిత్రాలు కూడా అని నిఖిల్ తెలిపాడు. తెలుగులో ఏడాదికి 150కి పైగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అన్ని చిత్రాల్లో నేనొక్కడినే నటించలేను. ఎవరి చిత్రాలు వారికి ఉంటాయి.. పోటీ అవసరం లేదు అని నిఖిల్ తెలిపాడు.

    అలాంటి వారు రాజకీయాల్లో

    అలాంటి వారు రాజకీయాల్లో

    ఇటీవల ముగిసిన ఏపీ, తెలంగాణలో ఎన్నికల్లో వివిధ పార్టీలకు చెందిన కొంత మంది అభ్యర్థులకు నిఖిల్ మద్దతునిచ్చారు. దాని గురించి మాట్లాడుతూ.. జెడి లక్ష్మీనారాయణ, తలసాని సాయి కిరణ్, వైసిపి పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి అదీప్ రాజ్ లాంటి మరికొంత మందికి మద్దతునిచ్చా. లాంటి వ్యక్తులంతా రాజకీయాల్లో ఉండాలి. జనసేన పార్టీ తరుపున జెడి లక్ష్మీనారాయణ గారు హామీలని బాండ్ పేపర్ లో రాసి ఇచ్చారు. అది నాకు చాలా నచ్చింది. మంచి వారు ఏపార్టీలో ఉన్నా మద్దతు ఇవ్వడం మన భాద్యత అని నిఖిల్ తెలిపాడు.

    ఏసీలో జీవితం

    ఏసీలో జీవితం

    రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఏమైనా ఉందా అని ప్రశ్నించగా నిఖిల్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ఉదయం మంచి బ్రేక్ ఫాస్ట్ చేసి షూటింగ్ కి వెళతా. క్యారవాన్ లోకి వెళితే చల్లగా ఏసీ ఉంటుంది. ఆ రోజుకి షూటింగ్ లో షాట్ కంప్లీట్ చేసుకుని తిరిగి ఇంటికివస్తా. ఫ్రెండ్స్ తో సరదాలు చాలానే ఉంటాయి. హ్యాపీగా ఏసీలో సాగిపోయే జీవితం వదులుకుని రాజకీయాల్లోకి వచ్చి తిట్లు తినడం ఎందుకు అని నిఖిల్ నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. కానీ సమస్య వచ్చినప్పుడు సాయం చేసేందుకు వెనకాడకూడదు. తుఫాను వలన రైతులు నష్టపోయినపుడు, విద్యార్థులకు సమస్యలు ఎదురైనప్పుడు నా వంతు సాయం అందిస్తానని నిఖిల్ తెలిపాడు.

    English summary
    Nikhil interesting comments on Politics, here is why he is gives support some leaders . TN Santhosh directing this investigative thriller movie. Lavanya Tripathi playing female lead.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X