కార్తికేయ హిట్: నిఖిల్ రెమ్యూనరేషన్ హైక్
హైదరాబాద్: సినిమా ఇండస్ట్రీలో ఇపుడు పరిస్థితి ఎలా తయారైందంటే....హిట్టు కొడితే అందలం ఎక్కిస్తారు. రెమ్యూనరేషన్ పెంచేస్తారు. ప్లాపయితే వారిని వీలైనంత దూరం పెడతారు. ‘స్వామి రారా' హిట్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కుర్ర హీరో నిఖిల్, తాజాగా ‘కార్తికేయ' హిట్‌తో హాట్ కేక్ అయిపోయాడు.
పలువురు దర్శకులు, నిర్మాతలు నిఖిల్‌తో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అంతకు ముందు సినిమాకు రూ. 50 లక్షలు తీసుకునే నిఖిల్ .... తాజా హిట్‌తో రెమ్యూనరేషన్ ఏకంగా రూ. 1 కోటికి పెంచేసాడట. నిఖిల్ సినిమాలకు ఉన్న మార్కెట్ దృష్ట్యా పలువురు నిర్మాతలు అంత మొత్తం ఇవ్వడానికి కూడా వెనకాడటం లేదని టాక్.

ఒకప్పుడు సినిమా అవకాశాల కోసం ఏ కథలు పడితే ఆ కథలు చేసే నిఖిల్ ఇపుడు పూర్తిగా తన దృక్ఫథం మార్చుకున్నాడు. సెలెక్టెడ్‌గా కథలు చేస్తూ హిట్లు కొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు.


Click it and Unblock the Notifications











