నిఖిల్-సగం బ్యాంకాక్‌లో, సగం హైదరాబాద్‌లో
నిఖిల్ తాజా చిత్రం 'డిస్కో'షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమవుతోంది. ఈ చిత్రం షూటింగ్ నిమిత్తం గత మూడు నెలలుగా నిఖిల్ సగం బ్యాంకాక్ లో ,సగం హైదరాబాద్ లో గడుపుతున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు పూరి జగన్నాథ్ శిష్యుడు హరి కె.చందూరి. ఆయన మాట్లాడుతూ... మాగురువుగారి నేమ్, ఫేమ్ నిలబెట్టే స్థాయిలో దర్శకత్వం వహించాను అని భావిస్తున్నాను. యూత్ హీరోల్లో జోరుమీద ఉన్న నిఖిల్ ఖాతాలో మా 'డిస్కో' చేరుతుందని, హిట్ సినిమా అవుతుంది. ఇప్పటికే నిఖిల్ 'యువత', 'వీడుతేడా' వంటి హిట్స్‌తో యువప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ చిత్రాలకు ఫాలో అప్ చిత్రంగా 'డిస్కో' ఉంటుంది. వ్యయం పరంగా అధిక బడ్జెట్‌తో, భారీ తారాగణంతో తీస్తున్న చిత్రమిది.
కథాపరంగా సగం బ్యాంకాక్‌లో, సగం హైద రాబాద్‌లో తీశాం. కేరళలోని మున్నార్‌లో ఒకపాట, హైదరా బాద్‌లో రెండు పాటలు తీశాం. వాణిజ్యపరంగా అన్ని హంగులతో తీసిన ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలుగజేస్తుందని అన్నారు. అలాగే ఈ చిత్రానికి ఐదుగురు మూలస్థంబాలుగా నిలిచారు. వారు నిర్మాత అభినవ్‌రెడ్డి, రచయిత సతీష్ మల్లంపాటి, సంగీత దర్శకుడు మంత్ర ఆనంద్, ఫైట్ మాస్టర్స్ ప్రకాష్, వెంకట్, కెమెరామెన్ జోషి మల్హర్‌భట్‌లు. నిఖిల్, సారాశర్మ, ఎమ్మెస్.నారాయణ, అలీ, విజయ్, ఖయ్యూం, వంశీకృష్ణ, అశిష్‌విద్యార్థి, రఘుబాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు: సతీష్ మల్లంపాటి, ఛాయాగ్రహణం: జోషి మల్హర్‌భట్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: యామినీ మాథ్యూస్, నిర్మాత: కె.అభినవ్‌రెడ్డి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: హరి.కె.చందూరి.


Click it and Unblock the Notifications











