ఫన్ ప్రేమ కథ (నిఖిల్ 'డిస్కో'ప్రివ్యూ)

By Srikanya

'యువత', 'వీడుతేడా'వంటి చిత్రాలతో తనకంటూ క్రేజ్ తెచ్చుకున్న హ్యాపీడేస్ హీరో నిఖిల్ తాజా చిత్రం'డిస్కో'. పూరి జగన్నాధ్ శిష్యుడు హరి.కె.చందూరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ విడుదల కాబోతోంది. ఈ చిత్రం ఫుల్ ఎంటర్‌టైనర్ అనీ, రెండు గంటల పాటు హాయిగా నవ్వుకోవచ్చు అని చెప్తున్నారు. వ్యయం పరంగా అధిక బడ్జెట్‌తో, భారీ తారాగణంతో తీస్తున్న చిత్రమిది. రెండు వందలకు పైగా ప్రింట్లతో ఈ చిత్రం విడుదల అవుతోంది. చిత్రానికి U/A సర్టిపికేట్ తో సెన్సార్ సర్టిఫికేట్ లభించింది.

కథలో ...డిస్కో (నిఖిల్‌) ఎలాంటి లక్ష్యం లేకుండా తిరుగుతుంటాడు. ఈ రోజు ఎలా బతికామనే దానికే ప్రాధాన్యమిస్తాడు. ఈ క్రమంలో అతనికి షైనీ (సారాశర్మ)తో పరిచయం ఏర్పడుతుంది. అది ప్రేమగా మారుతుంది. ఆనందంగా గడచిపోతున్న డిస్కో జీవితంలో ఓ పెను మార్పు సంభవిస్తుంది. ఆ పరిస్థితుల్ని అతను ఎలా తట్టుకొన్నాడు? ఏం చేశాడు? అన్నది తెర మీదే చూడాలి.

దర్శకుడు మాట్లాడుతూ ''వినోదానికి పెద్ద పీట వేస్తూ రూపొందించిన చిత్రమిది. నిఖిల్‌ హుషారైన నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది''అన్నారు. కథాపరంగా సగం బ్యాంకాక్‌లో, సగం హైద రాబాద్‌లో తీశాం. కేరళలోని మున్నార్‌లో ఒకపాట, హైదరా బాద్‌లో రెండు పాటలు తీశాం. వాణిజ్యపరంగా అన్ని హంగులతో తీసిన ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలుగజేస్తుందని అన్నారు.


అలాగే మాగురువుగారి నేమ్‌, ఫేమ్‌ నిలబెట్టే స్థాయిలో దర్శకత్వం వహించాను అని భావిస్తున్నాను. యూత్ హీరోల్లో జోరుమీద ఉన్న నిఖిల్‌ ఖాతాలో మా 'డిస్కో' చేరుతుందని, హిట్‌ సినిమా అవుతుంది. ఇప్పటికే నిఖిల్‌ 'యువత', 'వీడుతేడా' వంటి హిట్స్‌తో యువప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ చిత్రాలకు ఫాలో అప్‌ చిత్రంగా 'డిస్కో' ఉంటుంది.


సంస్థ: స్త్టెల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌
నటీనటులు: నిఖిల్‌, సారాశర్మ, ఎం.ఎస్.నారాయణ, ఆలీ, విజయ్, ఖయ్యూం, వంశీకృష్ణ, అశిష్ విద్యార్థి, రఘుబాబు, కాశీ విశ్వనాథ్, టార్జన్, సుభాషిణి, కె.ఎల్.ప్రసాద్, రజిత, బ్యాంక్ విజయ్, జయవాణి, ప్రియదర్శిని, జగదీశ్వరి తదితరులు
కథ, మాటలు: సతీష్ మల్లంపాటి
కెమెరా: జోషి మల్హర్‌భట్
సంగీతం: 'మంత్ర' ఆనంద్
పాటలు: రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్ల
డ్యాన్స్: రఘు, గణేష్
ఆర్ట్: కె.వి.రమణ
ఫైట్స్: ప్రకాష్, వెంకట్,
ఎడిటర్: ప్రవీణ్‌పూడి
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: యామినీ మాథ్యూస్
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: హరి.కె.చందూరి.
నిర్మాత: కె.అభినవ్‌రెడ్డి
విడుదల: శుక్రవారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X