twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిఖిల్ 'డిస్కో'విడుదల తేదీ ఖరారు

    By Srikanya
    |

    నిఖిల్, సారాశర్మ జంటగా హరి.కె.చందూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'డిస్కో' అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. త్వరలో సెన్సార్ పూర్తి చేసి ఈ నెల 20న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. స్టైల్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం ఫుల్ ఎంటర్‌టైనర్ అనీ, రెండు గంటల పాటు హాయిగా నవ్వుకోవచ్చు అని చెప్తున్నారు.

    ఈ చిత్రం విషయమై నిర్మాత కె.అభినవ్‌రెడ్డి మాట్లాడుతూ...నిఖిల్ కెరీర్‌లో మంచి చిత్రం అవుతుంది. తన బాడీ లాంగ్వేజీకి తగ్గట్టుగా ఈ చిత్రం ఉంటుంది. కాస్టింగ్, బడ్జెట్ పరంగా 'డిస్కో' భారీ చిత్రం అవుతుంది. దర్శకుడు హరి, పూరిజగన్నాథ్ ప్రియశిష్యుడు కావడంతో ఆయన స్టైల్ ఆఫ్ మేకింగ్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఎక్కడా రాజీ పడకుండా సినిమాను తీశాం' అని తెలిపారాయన.

    ఈ చిత్రానికి దర్శకుడు పూరి జగన్నాథ్‌ శిష్యుడు హరి కె.చందూరి. ఆయన మాట్లాడుతూ... నాకు ఇది తొలి చిత్రం. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చిత్ర నిర్మాణం కోసం సహకరించారు. సతీష్ మల్లంపాటి రాసిన కథ, మాటలు, 'మంత్ర' ఆనంద్ అందించిన సంగీతం, ప్రకాష్, వెంకట్ కంపోజ్ చేసిన స్టంట్స్ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి. నిఖిల్ యాక్షన్ యూత్‌ని అలరిస్తుంది. కథాపరంగా సగం బ్యాంకాక్‌లో, సగం హైద రాబాద్‌లో తీశాం. కేరళలోని మున్నార్‌లో ఒకపాట, హైదరా బాద్‌లో రెండు పాటలు తీశాం. వాణిజ్యపరంగా అన్ని హంగులతో తీసిన ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలుగజేస్తుందని అన్నారు.

    అలాగే మాగురువుగారి నేమ్‌, ఫేమ్‌ నిలబెట్టే స్థాయిలో దర్శకత్వం వహించాను అని భావిస్తున్నాను. యూత్ హీరోల్లో జోరుమీద ఉన్న నిఖిల్‌ ఖాతాలో మా 'డిస్కో' చేరుతుందని, హిట్‌ సినిమా అవుతుంది. ఇప్పటికే నిఖిల్‌ 'యువత', 'వీడుతేడా' వంటి హిట్స్‌తో యువప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ చిత్రాలకు ఫాలో అప్‌ చిత్రంగా 'డిస్కో' ఉంటుంది. వ్యయం పరంగా అధిక బడ్జెట్‌తో, భారీ తారాగణంతో తీస్తున్న చిత్రమిది.

    ఎం.ఎస్.నారాయణ, ఆలీ, విజయ్, ఖయ్యూం, వంశీకృష్ణ, అశిష్ విద్యార్థి, రఘుబాబు, కాశీ విశ్వనాథ్, టార్జన్, సుభాషిణి, కె.ఎల్.ప్రసాద్, రజిత, బ్యాంక్ విజయ్, జయవాణి, ప్రియదర్శిని, జగదీశ్వరి తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ, మాటలు: సతీష్ మల్లంపాటి, కెమెరా: జోషి మల్హర్‌భట్, సంగీతం: 'మంత్ర' ఆనంద్, పాటలు: రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్ల, డ్యాన్స్: రఘు, గణేష్, ఆర్ట్: కె.వి.రమణ, ఫైట్స్: ప్రకాష్, వెంకట్, ఎడిటర్: ప్రవీణ్‌పూడి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: యామినీ మాథ్యూస్, నిర్మాత: కె.అభినవ్‌రెడ్డి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: హరి.కె.చందూరి.

    English summary
    
 The makers of Nikhil's 'Disco' have decided to release the film on April 20. The film has completed its shooting formalities recently. Abhinav Reddy and Macha Ramalinga Reddy are jointly producing the film and Hari K Chanduri is the director. Sara Sharma is making her debut as heroine with this film. Mantra Anand has scored music for the film. Nikhil is playing a different role in this film. Vamshi Krishna, Venu Madhav, Sayaji Shinde, Ali, Raghu Babu, MS Narayana, Krishna Bhagavan, Master Bharath, etc are the other cast.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X