Don't Miss!
- News
union budget: మరికొద్ది గంటల్లో పార్లమెంటులో కేంద్ర బడ్జెట్, ఆశలు, అంచనాలు
- Finance
gst: రికార్డు స్థాయిలో GST వసూళ్లు.. ఇప్పటివరకు ఇదే రెండవ అత్యధికం
- Sports
WPL 2023 వల్ల భారత మహిళా క్రికెట్ దశ మారుతోంది: హర్మన్‌ప్రీత్ కౌర్
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
ప్రమాదంలో చిక్కుకున్న నిఖిల్.. హిమపాతంలో కూరుకుపోయిన కార్తీకేయ2 టీమ్
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ పెళ్లి తర్వాత వరుస ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపారు. గతంలో తనకు మంచి పేరు తెచ్చిన కార్తీకేయ మూవీకి సీక్వెల్‌గా కార్తీకేయ2 మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా టీమ్ ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్‌లో హిమపాతంలో కూరుకుపోయింది. ఈ విషయాన్ని కార్తీకేయ2 టీమ్ వీడియో ద్వారా వెల్లడించింది. ఆ వివరాల్లోకి వెళితే..

5118 ఏళ్ల క్రితం నాటి కథతో
కార్తీకేయ 2 సినిమా విషయానికి వస్తే.. 5118 ఏళ్ల క్రితం నాటి కథతో వినూత్నమైన కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కుతున్నది. అనంత జ్ఞాన సంపద కోసం జరిగే అన్వేషణగా కథ సాగుతుందనేది ప్రాథమిక సమాచారం. స్వార్థానికి ఒకరు, సాధించడానికి ఒకరు. అతని సంకల్పానికి సాయం చేసినవారెవరు' అనే విభిన్నమై స్టోరీ లైన్‌తో రూపొందిస్తున్నారు.

కార్తీకేయ సినిమాకు సీక్వెల్‌గా
2014లో వచ్చిన కార్తీకేయ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మాతలుగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగు నిర్విరామంగా జరుగుతున్నది.

హిమాచల్ ప్రదేశ్‌లో షూటింగ్
కార్తీకేయ 2 సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను హిమాచల్ ప్రదేశ్‌లోని సిస్సు ప్రాంతంలో చిత్రీకరిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు భారీగా క్షీణించాయి. దాదాపు మైనస్ 6 డిగ్రీల ఉష్ణోగ్రతలో భారీగా కురుస్తున్న హిమపాతంలోయాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

కుండపోతగా మంచు వర్షం
కుండపోతగా మంచు కురుస్తున్న ప్రాంతంలో కార్తీకేయ టీమ్ చిక్కుబడింది. వ్యాన్స్, కారవాన్స్‌లోనే ఉంటూ నితిన్, ఇతర యూనిట్ సభ్యులు ఆందోళనలో మునిగిపోయారు. అంతటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా డైరెక్టర్ చందు మొండేటి యాక్షన్ కట్ చెబుతూ కనిపించారు.

నితిన్ ముఖంలో ఆందోళన
సిస్సు ప్రాంతంలో బయట హైఅలర్ట్ ప్రకటించారు. ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు అంటూ నితిన్ మాటలు వినిపించాయి. చలిని తట్టుకొవడానికి మంట పెట్టుకొని వేడిని ఆస్వాదిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య నితిన్ ముఖంలో ఓ రకమైన నిర్వేదం కనిపించింది.