నిఖిల్...పగ,ప్రతాకారాన్ని చల్లగా ఉన్నప్పుడే వడ్డిస్తాడట

నిఖిల్ హీరోగా సుధీర్‌ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ‘కేశవ’ ప్రీ-లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

By Srikanya

హైదరాబాద్ : ఆ మధ్యన శంకరాభరణం ఫ్లాఫ్ తో డీలా పడ్డ నిఖిల్... ఎక్కడికిపోతావు చిన్నవాడా చిత్రం సూపర్ హిట్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చేసాడు. తనకు డిఫరెంట్ గా ఉన్న చిత్రాలే సూట్ అవుతాయని అర్దం చేసుకున్నాడు. ఈ ఉషారులో నిఖిల్‌ మరో చిత్రం మొదలెట్టారు.

నిఖిల్ హీరోగా సుధీర్‌ వర్మ దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకోనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'కేశవ' అనే టైటిల్‌ పెట్టారు. ఈ చిత్రం ప్రీ-లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. సినీ విశ్లేషకుడు తరణ్‌ఆదర్శ్‌ ట్విట్టర్‌ ద్వారా ఈ ప్రీ-లుక్‌ను పంచుకున్నారు. ఆయన ట్వీట్‌ను నిఖిల్‌ రీట్వీట్‌ చేశారు.

ఈ నెల 24న చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రీ-లుక్‌లో పేర్కొన్నారు. నిఖిల్‌ 14వ చిత్రంగా తెరకెక్కుతోన్న 'కేశవ'లో 'పెళ్లి చూపులు' చిత్రంలో నటించిన రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తున్నారు. అభిషేక్‌ పిక్చర్స్‌ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిస్టరీ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

Nikhil’s Keshava Pre Look Poster is Here

రివేంజ్ ఈజ్ ఏ డిష్..బెస్ట్ స‌ర్వ‌డ్ కోల్డ్ అనే క్యాప్ష‌న్ తో రిలీజ్ చేసిన ప్రీ లుక్ పోస్ట‌ర్ కు విశేష స్పంద‌న ల‌భిస్తుంది. ప్ర‌తికారం నేప‌ధ్యంతో సాగే విభిన్న క‌థా చిత్ర‌మ‌ని ఈ పోస్టర్ ద్వారా తెలుస్తుంది.

నిర్మాత అభిషేక్‌ నామా మాట్లాడుతూ ''అప్పటిదాకా హుషారుగా ఉన్న ఓ కుర్రాడు పగ, ప్రతీకారం అంటూ తిరగడం మొదలుపెడతాడు. దానికి కారణం ఏంటి? అనే ఆసక్తికరమైన అంశంతో తెరకెక్కిస్తున్నాం. నిఖిల్‌-సుధీర్‌ వర్మ కాంబినేషనలో హిట్‌ చిత్రంగా నిలుస్తుంది'' అని అన్నారు.

Nikhil’s Keshava Pre Look Poster is Here

దర్శకుడు మాట్లాడుతూ ''రివెంజ్‌ డ్రామా ఇది. నిఖిల్‌ కొత్తగా కనిపిస్తాడు. లవ్‌స్టోరీ ఆసక్తికరంగా ఉంటుంది. కాకినాడ నుంచి విశాఖ వరకు ఉన్న సమద్రతీర ప్రాంతంలో షూటింగ్‌ చేస్తాం'' అని అన్నారు. ఇషా కొప్పికర్‌ పోలీసాఫీసర్‌గా నటిస్తోంది. రావు రమేశ, అజయ్‌, బ్రహ్మాజీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కళ: రఘు కులకర్ణి, కెమెరా: దివాకర్‌ మణి, సంగీతం: సన్నీ.యం.ఆర్‌..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X