‘కిరిక్ పార్టీ’ రీమేక్: నిఖిల్ సరసన సంయుక్త హెగ్డే!

కిరిక్ పార్టీ తెలుగులో రీమేక్ కాబోతోంది. ఈ చిత్రంలో నిఖిల్ హీరోగా నటిస్తున్నాడు.

By Bojja Kumar

కన్నడలో సూపర్ హిట్ అయిన "కిరిక్ పార్టీ" అనే చిత్రాన్ని తెలుగులో నిఖిల్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. ఎ.కె.ఎంటర్ టైన్మెంట్ సంస్థ రూపొందిస్తున్న ఈ చిత్రం ద్వారా శరణ్ కొప్పిశెట్టి అనే దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ చిత్రానికి సుధీర్ వర్మ స్క్రీన్ ప్లే, చందూ మొండేటి సంభాషణలు సమకూరుస్తున్నారు.

వరుస విజయాల బాటలో ఉన్న నిఖిల్ నటిస్తున్న సినిమా కావడంతోషూటింగ్ మొదలవ్వడానికి ముందే ఈ చిత్రంపై మంచి క్రేజ్ ఏర్పడింది. కన్నడ ఒరిజినల్ వెర్షన్ లో కథానాయికగా నటించిన సంయుక్త హెగ్డే ఇందులో వన్ ఆఫ్ ది హీరోయిన్ గా నటిస్తోంది.

Nikhil's "Kirik Party" Telugu Remake Shoot Started !

అజనీష్ లోక్నాధ్ సంగీత సారధ్యం వహించనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం హైద్రాబాద్ లో జరుగుతోంది. క్యారెక్టర్ కోసం నిఖిల్ మేకోవర్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా సంయుక్త హగ్డే నటిస్తుండగా.. మరో హీరోయిన్ ఎంపిక ప్రస్తుతం జరుగుతోంది. త్వరలో పూర్తి వివరాలు ప్రకటిస్తామని చిత్ర యూనిట్ తెలిపింది.

Nikhil's "Kirik Party" Telugu Remake Shoot Started !

ఈ చిత్రానికి సంగీతం: అజనీష్ లోక్నాధ్. మాటలు: చందూ మొండేటి, స్క్రీన్ ప్లే: సుధీర్ వర్మ, కళ: అవినాష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికపాటి, కో ప్రొడ్యూసర్స్: అజయ్ సుంకర-అభిషేక్ అగర్వాల్, బ్యానర్: ఎ.కె.ఎంటర్ టైన్మెంట్, నిర్మాత: రామబ్రహ్మం సుంకర, దర్శకత్వం: శరణ్ కొప్పిశెట్టి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X