హీరో నిఖిల్ 'కిర్రాక్ పార్టీ' ఫస్ట్ లుక్ అదుర్స్
ఏ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిఖిల్ హీరోగా వస్తున్న 'కిర్రాక్ పార్టీ' ఫస్ట్ లుక్ విడుదలైంది. కన్నడలో సూపర్ హిట్‌గా అయిన 'కిరిక్ పార్టీ' సినిమాకు ఇది రీమేక్. కాలేజీ బ్యాక్ డ్రాప్ లో సాగే చిత్రం కావడంతో చాలావరకు కొత్త నటీనటులను ఎంపిక చేశారు నిర్మాతలు.
క్యాస్టింగ్ కాల్ ద్వారా వచ్చిన సుమారు 60 వేల అప్లికేషన్ల నుండి తమ సినిమాకు తగిన వారిని ఎంపిక చేసుకుని సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా శరన్ కొప్పిశెట్టి దర్శకునిగా పరిచయం అవ్వబోతున్నారు. 70 శాతం షూటింగ్ పూర్తయింది.

నిఖిల్ తో 'స్వామి రారా' తీసిన సుదీర్ వర్మ స్క్రీన్ ప్లే అందించగా, డైలాగ్స్ 'కార్తికేయ' దర్శకుడు చందూ మొండేటి రాసారు. సంయుక్త హెగ్డే మరియు సిమ్రన్ పరీన్జా హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ చిత్తానికి రామబ్రహ్మం సుంకర నిర్మాత.
ఈ చిత్రంలో నిఖిల్, సంయుక్త హెగ్డే, సిమ్రన్ పరీన్జా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: అజనీష్ లోకనాథ్, మాటలు: చందూ మొండేటి, స్క్రీన్ ప్లే: సుధీర్ వర్మ, ఛాయాగ్రహం - అద్వైత గురుమూర్తి, ఎడిటర్: ఎం.ఆర్. వర్మ, ఆర్ట్: అవినాష్, కో-డైరెక్టర్: సాయి దాసం, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కిషోర్ గరికిపాటి, కో-ప్రొడ్యూసర్స్: అజయ్ సుంకర - అభిషేక్ అగర్వాల్, నిర్మాత: రామబ్రహ్మం సుంకర, దర్శకుడు- శరన్ కొప్పిశెట్టి.


Click it and Unblock the Notifications











