అనుకున్నంత అయింది, , కార్తికేయ 2 వాయిదా.. అధికారికంగా ప్రకటించిన నిఖిల్!

నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న కార్తికేయ 2 సినిమా వాయిదా పడే అవకాశం ఉందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అదే నిజం అయింది. దిల్ రాజు నిర్మాణంలో నాగచైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన థాంక్యూ సినిమా కూడా జూలై 22వ తేదీన విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో దిల్ రాజు కార్తికేయ 2 నిర్మాతలను సినిమా వాయిదా వేసుకోవాలని కోరినట్లు ప్రచారం జరిగింది. అయితే ఈ విషయం మీద ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. కానీ తాజాగా నిఖిల్ సిద్ధార్థ తన సోషల్ మీడియా వేదికగా సినిమా వాయిదా పడినట్లు ప్రకటించారు.

విషయం ఏమిటంటే తాజాగా లండన్ లోని ఒక ప్రాంతంలో ప్రీమియర్ షో టికెట్లు పెట్టిన 25 నిమిషాలలోనే అన్ని టికెట్లు ఫుల్ అయ్యాయి అంటూ ఒక నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు దానికి సారీ చెప్పిన నిఖిల్ సిద్ధార్థ సినిమా 22వ తేదీన విడుదల కావడం లేదని ఆగస్టు ఒకటో వారంలో విడుదలవుతోందని వెల్లడించారు.. ఇక ఈ సినిమా ప్రీమియర్ షో కోసం టికెట్లు బుక్ చేసిన అద్భుతమైన ప్రేక్షకులందరికీ సారీ చెబుతున్నానని మీ డబ్బులు మీకు వెనక్కి వస్తాయని నిఖిల్ పేర్కొన్నాడు. చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా పెరగెక్కిన కార్తికేయ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్ గానే కార్తికేయ 2 సినిమా తెరకెక్కిస్తున్నామని గతంలోనే ప్రకటించారు.

nikhil siddarth announces karthikeya 2 postponement

ఆ ప్రకటించిన దాని మేరకు సినిమాను రూపొందించారు ఈ సినిమాలో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తోంది.. మరోపక్క ఈ సినిమా నుంచి నన్ను నేను అడిగా అనే పాట మంగళవారం సాయంత్రం విడుదల కానుంది. ఈ కార్తికేయ 2 సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ల మీద టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్, టాలీవుడ్ కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి ఈ సినిమాలో కీలక పాత్రలలో నటిస్తున్నారు. అలాగే కమెడియన్లు ప్రవీణ్, వైవా హర్ష, సత్య, ఆదిత్య మీనన్, తులసి, వెంకట్ తదితరులు ఈ సినిమాలో ఇతర పాత్రలలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు వివేక్ కూచిభట్ల సహా నిర్మాతగా వ్యవహరిస్తూ ఉండగా కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. సంగీతం కాలభైరవ అందిస్తున్నారు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X