టాలీవుడ్ నుంచి మరో పాన్ ఇండియా సినిమా..'స్పై'గా అడుతుపెడుతున్న నిఖిల్ సిద్దార్థ్

చాలా కాలం నుండి సరైన హిట్ కోసం ఇబ్బంది పడుతున్న యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ వరుస సినిమాలు లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో వివాహం చేసుకున్న ఆయన ఇప్పటికే కార్తికేయ సీక్వెల్ గా తెరకెక్కుతున్న కార్తికేయ 2, సుకుమార్ శిష్యుడు దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు.. ఇప్పుడు ఆయన హీరోగా ఒక సినిమా అధికారికంగా ప్రకటించారు. ఆ వివరాల్లోకి వెళితే

హ్యాపీడేస్ చిత్రంతో

హ్యాపీడేస్ చిత్రంతో

శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వం వహించిన ''హ్యాపీడేస్' చిత్రంతో వెండి తెర‌కు ప‌రిచ‌య‌మయ్యాడు నిఖిల్. మొద‌టి సినిమాతోనే ప్రేక్ష‌కుల‌కు దగ్గరయ్యాడు నిఖిల్. తర్వాత వరుస పరాజయాలు చవిచూశాడు. స్వామి రారా చిత్రంతో అతని కెరీర్ మరోసారి మలుపు తిరిగింది. కార్తికేయ‌, 'ఎక్క‌డికి పోతావ్ చిన్న‌వాడ‌', 'అర్జున్ సుర‌వ‌రం' వంటి హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

కార్తికేయ 2

కార్తికేయ 2

అయితే హీరో నిఖిల్ సిద్ధార్థ్ సరైన హిట్ అందుకొని చాలా కాలమే అయింది. చివరిగా ఎక్కడికి పోతావు చిన్నవాడా అనే సినిమాతో హిట్ అందుకున్న ఆయన ఆ తర్వాత కేశవ, కిరాక్ పార్టీ వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కానీ ఆకట్టుకోలేకపోయాడు.

అయితే అర్జున్ సురవరంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఒక మాదిరి హిట్ అందుకున్నాడు కానీ ఆయన ఎలాగైనా భారీ హిట్ కొట్టాలనే ఉద్దేశంతో కనిపిస్తున్నాడు. ఇందులో భాగంగా గతంలో సూపర్ హిట్ అయిన కార్తికేయ అనే సినిమాకు సీక్వెల్ గా కార్తికేయ 2 అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

అధికారికంగా

అధికారికంగా

ఈ సినిమా కాకుండా కుమారి 21 ఎఫ్ సినిమా దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా చేస్తున్న సమయంలో ఆయన ప్రేమించిన పల్లవి వర్మ అనే డాక్టర్ ని వివాహం కూడా చేసుకున్నారు. ఇదిలా ఉండగా తాజాగా నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా కొత్త సినిమా అధికారికంగా ప్రకటించారు.

 'స్పై' టైటిల్

'స్పై' టైటిల్

ఎడిటర్ గ్యారీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి 'స్పై' అనే టైటిల్ ను ఖరారు చేయటంతోపాటు నిఖిల్ ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనుంది. ఈ ఏడాది దసరాకు ఈ చిత్రాన్ని తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాలో నిఖిల్ కు జోడిగా ఐశ్వర్య మీనన్ నటిస్తోంది. ఈ చిత్రాన్ని ఈడీ ఎంట‌ర్టైన‌మెంట్స్ ప‌తాకంపై కె. రాజ‌శేఖ‌ర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

సూపర్ స్టైలిష్‌గా

సూపర్ స్టైలిష్‌గా

యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ మూవీ పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. నిఖిల్ చేతిలో షాట్‌గన్‌ పట్టుకుని, సూపర్ స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. 'స్పై'ని తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. అభినవ్ గోమతం, సన్యా ఠాకూర్, జిషు సేన్‌గుప్తా, నితిన్ మెహతా, రవివర్మ తదితరులు ఈ సినిమాలో ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ హై బడ్జెట్ సినిమాకు పలువురు హాలీవుడ్ టెక్నీషియన్లు పని చేస్తుండగా, శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X