Kartikeya 2: ఎంత కష్టపడ్డా నీ సినిమా రిలీజ్ అవ్వదురా.. అలా అనగానే ఏడ్చాను: నిఖిల్

యువ హీరో నిఖిల్ నటించిన కార్తికేయ 2 ఆగస్టు 12న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాను గత నెల నుంచి విడుదల చేయాలని అనుకున్నప్పటికి కూడా సాధ్య పడలేదు. అందుకు కారణం కొంతమంది సినీ ప్రముఖులు అని బయట టాక్ వచ్చింది. అంతే కాకుండా బ్యాక్ గ్రౌండ్ లేని హీరో కాబట్టే థియేటర్స్ దొరకనివ్వకుండా చేస్తున్నారని కూడా కామెంట్స్ అయితే చాలానే వచ్చాయి. ఇక ఆ విషయంలో నిఖిల్ ఎమోషనల్ అయినట్లు ఇటీవల ఇంటర్వ్యూలో తెలియజేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

గ్రాండ్ రిలీజ్

గ్రాండ్ రిలీజ్

2014లో చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన కార్తికేయ సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఆ సినిమా తర్వాత నిఖిల్ వెంటనే సీక్వెల్ కూడా తెరపైకి తీసుకురావాలి అని దర్శకుడు చర్చలు జరిపాడు. ఇక చాలాకాలంగా చందు సీక్వెల్ కథను సిద్ధం చేసుకుంటూ వచ్చాడు. ఫైనల్ గా కార్తికేయ 2 సినిమా అన్ని పనులను కూడా పూర్తి చేసుకుని ఆగస్టు 12వ తేదీన నిఖిల్ కెరీర్ లోనే అత్యధిక థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదలకు రెడీ అయింది.

 ఆ రెండు సినిమాల కోసం వాయిదా

ఆ రెండు సినిమాల కోసం వాయిదా

తెలుగులోనే కాకుండా తమిళ్ హిందీ మలయాళం కన్నడ భాషల్లో కూడా ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఇక హిందీలో కూడా నిఖిల్ ఈ సినిమాకు డబ్బింగ్ చెబుతూ ఉండడం విశేషం. అసలైతే కార్తికేయడ 2 సినిమాను జూలై 22వ తేదీన విడుదల చేయాలని అనుకున్నారు. కానీ అప్పుడు థాంక్యూ సినిమా విడుదల సందర్భంగా వాయిదా వేసుకోవలసి వచ్చింది. అలాగే ఆగస్టు 5వ తేదీన కూడా విడుదల చేయాలని అనుకున్నారు కానీ అదే సమయంలో బింబిసార కూడా విడుదలవుతోంది. ఈ తరుణంలో కార్తికేయ 2 సినిమాకు స్పేస్ దొరకలేదు.

ఫస్ట్ టైమ్ ఏడ్చాను

ఫస్ట్ టైమ్ ఏడ్చాను

ఒక విధంగా బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరోలు సినిమాలు విడుదలవుతూ ఉండడంతో కార్తికేయ సినిమాకు థియేటర్స్ దొరకలేదు అనే కామెంట్స్ కూడా చాలానే వచ్చాయి. అయితే ఈ విషయంలో నిఖిల్ సిద్ధార్థ చాలా సున్నితంగా స్పందించే ప్రయత్నం చేశాడు. ఒక విధంగా తన సినిమా రిలీజ్ అవ్వదు రా అని అనుకుంటున్న సమయంలో చాలా ఏడ్చాను అని లైఫ్ లో మొదటిసారి కార్తికేయ 2 సినిమా కోసం ఏడ్చినట్లుగా నిఖిల్ తెలియజేశాడు.

 ఆ డేట్ కూడా వద్దని అన్నారు

ఆ డేట్ కూడా వద్దని అన్నారు

ఒక విధంగా మా సినిమాను వెనక్కు తోసేయాలని చూసారు. జీవితంలో మొదటి సారి ఆ రోజు ఏడ్చాను. ఒక విధంగా ఆగస్టు 12వ తేదీన విడుదల చేయాలని అనుకున్నప్పుడు అనౌన్స్ చేసినప్పుడు అది కూడా వద్దని చెప్పారు. అక్టోబర్ లేదా నవంబర్ కి వెళ్లిపోండి ఇప్పుడప్పుడే ఈ సినిమా రిలీజ్ అవ్వదు మీకు షోలు దొరకవు మీకు థియేటర్లో ఇవ్వము అనే స్టేజ్ కొరకు వెళ్ళింది.. అప్పుడే ఏడ్చాను అని నిఖిల్ అన్నారు.

థియేటర్లు దొరకవు..

థియేటర్లు దొరకవు..

నేను ఎంత స్ట్రాంగ్ అయినప్పటికీ కూడా కార్తికేయ 2 విషయంలో అలా జరగగానే చాలా బాధ వేసింది. హ్యాపీ డేస్ సినిమా నుంచి చూస్తున్నాను ఎప్పుడూ కూడా థియేటర్లు దొరకవు అని ఆ చేదు అనుభవం నాకు ఎదురవలేదు. ఈ సినిమా కోసం ప్రమోషన్స్ కోసం ఎంత కష్టపడినా కూడా మీ సినిమా రిలీజ్ అవ్వదు రా అన్నప్పుడు చాలా బాధేసింది.. అని నిఖిల్ తెలియజేశారు.

నిర్మాతల సపోర్ట్

నిర్మాతల సపోర్ట్

ఇబ్బందులు ఉన్నా కూడా మా నిర్మాతలు మాత్రం ఈ విషయంలో చాలా బాధ్యతగా వ్యవహరించి సపోర్టింగ్ గా నిలిచారు. సినిమాకు ఇప్పుడు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా విడుదల అవుతుంది.. అని ఈ విషయంలో దిల్ రాజు, ఏషియన్ సునీల్ వాళ్లు కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నట్లు నిఖిల్ తెలియజేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X