ఎన్నో వాయిదాలు.. మరెన్నో వివాదాలు.. మొత్తానికి యంగ్ హీరో వచ్చేస్తున్నాడు..
ఒక సినిమాను తీయడం ఎంత కష్టమో.. దాన్ని సరైన సమయానికి విడుదల చేయడం కూడా అంతే కష్టం.. చిన్న సినిమాల్లో అయితే ఇది మరింత స్పష్టంగా కనిపిస్తుంది. సినిమా చిత్రీకరణ ఎప్పుడో ముగిసినా.. థియేటర్లలో రావడానికి మాత్రం చాలా కష్టపడే సినిమాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో నిఖిల్ నటించిన అర్జున్ సురవరం ముందు వరుసలో ఉంటుంది.

వివాదాలతో సతమతై..
తమిళ మూవీ కణిథన్ చిత్రానికి రీమేక్గా తెరకెక్కిన ఈ మూవీ టైటిల్ విషయంలో వివాదం రేగింది. ముద్ర అనే టైటిల్తో పోస్టర్స్ రిలీజయ్యాయి. అయితే అదే టైటిల్తో మరో సినిమా రావడం, దానిపై నిఖిల్ నోరు జారడం.. నిర్మాతలు ఫైర్ అవ్వడం అప్పట్లో వైరల్ అయ్యయి. తీరా ముద్ర అనే టైటిల్ను మార్చేసింది చిత్రయూనిట్.

ఎన్నో వాయిదాలతో వెనకబడింది..
టైటిల్ విషయంలోనే వివాదం రేగిన ఈ మూవీకి విడుదల చేయడానికి మాత్రం సరైన సమయం దొరకడం లేదు. తమ సినిమాకు టైటిల్ ను సూచించాల్సిందిగా సోషల్ మీడియాలో ఓ కాంటెస్ట్ ను కూడా పెట్టేశారు. దీంతో అందరి అభీష్టం మేరకు సినిమాలో నిఖిల్ పేరునే టైటిల్గా మార్చేశారు. అర్జున్ సురవరం అనే టైటిల్తో పోస్టర్స్ ను రిలీజ్ చేశారు. అయితే ఎప్పుడో రావాల్సిన ఈ సినిమా ఇంకా ప్రేక్షకుల ముందుకు రాలేకపోతోంది.

డేట్ దొరికిసేందంటూ హీరో ప్రకటన
ఎట్టకేలకు తమ సినిమాను విడుదల చేసేందుకు సరైన సమయం దొరికినందుకు ఫుల్ ఖుషీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు నిఖిల్ సోషల్ మీడియా చేసిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది. సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్.. డేట్ దొరకేసిందోచ్ అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఈ వారంలోనే విడుదల కానున్న తేదీని ప్రకటించనున్నట్లు తెలిపాడు. లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటించిన ఈ మూవీని టీ. సంతోష్ తెరకెక్కించారు. ఈ హీరో కార్తికేయ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కించే పనిలో ఉన్నాడు.


Click it and Unblock the Notifications











