నాకంత సీన్ లేదు, ఎలక్షన్స్‌లో ఆయనకు మాత్రమే సపోర్ట్ చేయడానికి కారణం.. రూమర్స్‌పై హీరో నిఖిల్!
Recommended Video

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ా ఎన్నికల వేడి నెలకొని ఉంది. అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాలతో మోతెక్కిస్తున్నాయి. చాలా మంది సినీ తారలు కూడా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. కొందరు సెలెబ్రిటీలు తమకు నచ్చిన వారికోసం ప్రచారం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రలో టాలీవుడ్ సెలెబ్రిటీలు కొందరు తమకు నచ్చిన పార్టీలకు మద్దత్తు తెలుపుతున్నారు. తాజాగా యువ హీరో నిఖిల్ తనపై వస్తున్న అసత్య ప్రచారంపై స్పందించాడు. నిఖిల్ ఓ రాజకీయ పార్టీకి మద్దత్తు తెలుపుతున్నాడు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో నిఖిల్ స్పందన ఆసక్తిగా మారింది.

అంతా అబద్దం
నిఖిక్ ఓ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి అని, అతడు ఆ పార్టీ కోసం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాడు అని సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై నిఖిల్ స్పందించాడు. నా గురించి ఓ ఫేక్ న్యూస్ ప్రచారం జరుగుతోంది. అందులో ఏ మాత్రం వాస్తవం లేదు. నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. కానీ ధోన్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించడానికి గల కారణాన్ని మాత్రం నిఖిల్ తెలియజేశాడు.

మా ఫ్యామిలీ మెంబర్
తాను ధోన్ నియోజకవర్గంలో ప్రజలని కలసి ఓ వ్యక్తికి ఓట్ వేయమని అడిగిన మాట వాస్తవమే అని నిఖిల్ తెలిపాడు. ధోన్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కే ఈ ప్రతాప్ పోటీ చేస్తున్నారు. ఆయన మా ఫ్యామిలీ మెంబర్. నిజాయతీ కలిగిన వ్యక్తి. ధోన్ నియోజకవర్గ అభివృద్ధి కోసం మా అంకుల్ చాలా చేశారు. మంచి వ్యక్తి కాబట్టే ఆయనకు మద్దతుగా ప్రచారం చేసినట్లు నిఖిల్ తెలిపాడు.

ఏ పార్టీలో ఉన్నా సరే
చాలా మంది మంచి అభ్యర్థులు వివిధ పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు. మంచి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా వారందరికీ నా మద్దతు ఉంటుంది. టిడిపి, వైసిపి, జనసేన, బిజెపి, కాంగ్రెస్ ఇలా నాకు పార్టీలతో సంబంధం లేదు. మంచి వాళ్లకు ఓట్ వేయమని అడుగుతా. నా వల్ల ఓట్లు పడిపోతాయి, వాళ్ళు గెలిచిపోతారు అని కాదు. నాకు అంత సీన్ లేదు అని నిఖిల్ తెలిపాడు. నటుడిగా కాకుండా, భారత పోరుడిగా మంచి వాళ్లకు మద్దతు తెలిపే హక్కు తనకు ఉందని నిఖిల్ తెలిపాడు.

అర్జున్ సురవరం
ఇక సినిమాల విషయానికి వస్తే నిఖిల్ ప్రస్తుతం అర్జున్ సురవరం చిత్రంలో నటిస్తున్నాడు. మే 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. టి ఎన్ సంతోష్ ఈ చిత్రానికి దర్శకుడు. నిఖిల్ ఈ చిత్రంలో జర్నలిస్ట్ పాత్రలో నటిస్తున్నాడు. నిఖిల్ కు జోడిగా లావణ్య త్రిపాఠి నటిస్తోంది. కొన్ని రోజుల క్రితం విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఉత్కంఠ భరిత సన్నివేశాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











