కేటీఆర్, డీజీపీ సర్ ఏంటి ఇది.. విషాదకర ఘటనపై టాలీవుడ్ రియాక్షన్

తెలంగాణ కొత్తగూడెంలో 3 రోజుల క్రితం దేవిక (17) అనే మైనర్ బాలిక మృతదేహం అనుమానాస్పదమైన రీతిలో రైలు పట్టాలపై లభ్యమైంది. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంత దారుణమైన ఘటన సంభవించినా మీడియాలో ఎక్కడా కూడా హైలెట్ కాకపోవడం, చేయకపోవడంతో సోషల్ మీడియా ఆ బాధ్యతను తీసుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో #JusticeforDevika అనే హ్యాష్ ట్యాగ్‌తో సినీ, రాజకీయ నాయకులకు ఈ విషయాన్ని తెలిసేలా చేస్తున్నారు.

సోషల్ మీడియాలో వైరల్..

సోషల్ మీడియాలో వైరల్..

ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రతీ సున్నితమైన అంశం ఎంతగానో వైరల్ అవుతోంది. అక్కడే ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతోంది. సినీ, రాజకీయ, పోలీసు అధికారులు ఇలా ప్రతీ ఒక్కరూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే ఉంటున్నారు. సమాజంలో జరిగే అన్యాయాలను వారి దృష్టికి తీసుకెళ్తూ న్యాయాన్ని కోరుతున్నారు. తాజాగా కొత్త గూడెం ఘటనపై నెటిజన్లు న్యాయం కావాలని డిమాండ్ చేస్తున్నారు. వీరికి మద్దతుగా టాలీవుడ్ సెలెబ్రిటీలు నిలిచారు.

మంచు మనోజ్ రియాక్షన్..

మంచు మనోజ్ రియాక్షన్..

సామాజిక సమస్యలపై వెంటనే స్పందించే మనోజ్ దేవిక ఘటనపై ఎమోషనల్ అయ్యాడు. ‘దేవిక ఇంటర్ విద్యార్థిని.. రేప్ చేసి రైల్వే ట్రాక్ మీద పడేశారు. అయినా ఈ ఘటనపై ఎవ్వరూ స్పందించడం లేదు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలని నేను కోరుతున్నాను. ప్రియాంక రెడ్డి విషయంలో చేసిన న్యాయాన్నే ఈ ఘటనలోనూ చేయాలని కోరుతున్నా'ని ట్వీట్ చేశాడు.

కేటీఆర్, డీజీపీ సర్..

కేటీఆర్, డీజీపీ సర్..


మరో యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ స్పందిస్తూ.. ‘ఇప్పుడే చూశాను. దిశ తరువాత.. అమ్మాయిని తాకడానికే భయపడతారని అనుకున్నాను. కానీ ఇక్కడ మరో సోదరిని తీసుకెళ్లారు. కేటీఆర్, డీజీపీ సర్ ఇదేంటీ దోషులను పట్టుకోండి న్యాయం చేయండ'ని కోరాడు.

ఇంకా పెద్ద శిక్ష ఏదైనా..

ఇంకా పెద్ద శిక్ష ఏదైనా..

ట్విట్టర్‌లో నిత్యం యాక్టివ్‌గా ఉండే హరీష్ శంకర్ దేవిక ఘటనపై స్పందించాడు. ‘ఎన్ కౌంటర్స్ చేసినా బుద్ది రావడం లేదు అంటే ఇంకా పెద్ద శిక్షలు ఏదైనా ఆలోచించాలేమో.. నిస్సహాయతలో ఉన్నానని అనిపిస్తోంద'ని ట్వీట్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X